Ads
మనం సోషల్ మీడియాలో రోజు వింత వింత సంఘటనలు చూస్తూ ఉంటాం.వాటిని చూసినప్పుడు మనం ఆశ్చర్య పోవడం ఖాయం. కొన్ని విషయాలు చూసినప్పుడు ఇలా కూడా చేస్తారా అని అనిపించక మానదు. ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు మనం ముందు ఆశ్చర్య పోవడం ఖాయం. మరి ఇప్పుడు ఈ ఘటన విన్నా కూడా మీరు అలానే అయిపోతారు. తాజాగా గుజరాత్ లో ఓ స్కూల్ టీచర్ కి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ చేసేందుకు కొత్త పద్ధతి ఫాలో అయ్యింది. దాన్ని చూసిన అంతా షాక్ అవుతున్నారు.
Video Advertisement
మాములుగా ఎవరైనా తమ దగ్గర ఉద్యోగుల్ని నియమించేందుకు ఏం చేస్తారు. పేపర్ లో యాడ్ ఇస్తారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియా లో పోస్టింగ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయితే తాజాగా ట్విట్టర్ లో ఒక ఉద్యోగానికి ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి వైరల్ గా మారింది. గుజరాత్ లోని భక్తశ్రామ్ స్కూల్ కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అది. ఆ స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ కోసం ఒక యాడ్ ఇచ్చింది.
గుజరాత్ రాష్ట్రము లోని నవశ్రీ జిల్లాలోని భక్తశ్రామ్ స్కూల్ లో ఒక మ్యాథ్స్ టీచర్ కావాల్సి వచ్చింది. దీంతో దాని కోసం ఆ యాడ్ ఇచ్చారు. ఇందులో ఆ పోస్ట్ కోసం కాంటాక్ట్ చెయ్యాలి అనుకునేవారు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండి. అని ఫోన్ నెంబర్ డైరెక్ట్ గా ఇవ్వకుండా.. ఒక మ్యాథ్స్ ఈక్వేషన్ ఇచ్చి.. దాన్ని క్రాక్ చేసి ఆ నెంబర్ కి కాల్ చెయ్యమని ఆ యాడ్ లో ఇచ్చారు. దీంతో ఆ యాడ్ ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఆ యాడ్ ని చూసిన అందరూ ఇంత వినూత్నంగా ఎలా ఆలోచించారా అని షాక్ అవుతున్నారు. ఈ యాడ్ వల్ల సరైన మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ దొరుకుతారు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రకటన చూసి నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు అంటూ ఈ ప్రకటన ఇచ్చారు.ఇది చూసిన నెటిజెన్స్ కు ఏం స్పందించాలో కూడా అర్ధం అవ్వడం లేదు. బాబోయ్ ఇంత మ్యాథ్స్ ఆహ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డేకేడ్ కి ఇదే బెస్ట్ యాడ్ అని మిశ్రమ కామెంట్లు చేస్తున్నారు.
End of Article