టీం ఇండియా కు మరో అద్భుతమైన క్రికెటర్ దూరం అయ్యాడు. అతనెవరో కాదు.. ఢిల్లీ కి చెందిన ముప్పయ్యేళ్ల బ్యాట్స్ మెన్ మిలింద కుమార్. తాజాగా మిలింద కుమార్ ఇండియన్ జట్టుని వదిలి.. అమెరికా కు చెందిన మైనర్ లీగ్ క్రికెట్ టోర్నీ ని ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు.

milinda kumar 1

ఈ విషయమై మిలింద స్పందిస్తూ..” నేను ఇండియన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నా.. బీసీసీఐ అధికారులకు కూడా ఈ విషయమై ఇప్పటికే తెలియ చెప్పాను.. ఢిల్లీ జట్టు తరపున ఇషాంత్ శర్మ, విరాట్, శిఖర్ వంటి గొప్ప క్రికెటర్ల తో కలిసి ఆట ఆడటం అదృష్టం గా భావిస్తున్నా.. అయితే మరిన్ని అవకాశాల కోసమే జట్టుని వీడాల్సి వస్తోంది..” అంటూ పేర్కొన్నాడు.

milinda kumar 2

భారత్ లో ఢిల్లీ, త్రిపుర, సిక్కిం జట్లతో మిలింద ఓ ఆట ఆడేసాడు. ఐపీఎల్ లో కూడా రాయల్ చాలెంజర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున కూడా ఆడి తన సత్తా చూపించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా 85 బంతుల్లో గాను 78 పరుగులు చేసి అందరిని మెప్పించాడు.

milinda kumar 3

అలాగే 2017 వ సంవత్సరం లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఒకే సీజన్ లో 121 యావరేజ్ ను మైంటైన్ చేస్తూ 8 మ్యాచ్లలో ఏకం గా 1331 పరుగులని చేసి రికార్డు సృష్టించాడు. 6 సిక్సర్లు, నాలుగు హాఫ్ సెంచరీలతో దూసుకెళ్లాడు. ప్రస్తుతం ఇండియన్ జట్టుకు దూరం కావడం క్రికెట్ ప్రియులను బాధపరిచే అంశమే.