1300 రూపాయలు కాపాడడం కోసం కాలు పెట్టావ్…కానీ ఇంకో 1500 ఫైన్ పడింది.!

1300 రూపాయలు కాపాడడం కోసం కాలు పెట్టావ్…కానీ ఇంకో 1500 ఫైన్ పడింది.!

by Anudeep

Ads

ఇటీవల పెంచిన ట్రాఫిక్ ఫైన్స్ అందరికి ఇబ్బందికరం గా మారాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించమని మాములుగా చెప్తే జనాలు వినిపించుకోవడం లేదని ఫైన్స్ ని పెంచేశారు. ఆ ఫైన్స్ ని పడకుండా ఎగ్గొట్టుకోవడానికి జనాలు వేస్తున్న వేషాలు అన్నీ ఇన్నీ కావు. ఇవి గమనించినప్పుడల్లా సైబరాబాద్ పోలీస్ లు వాటిని ట్విట్టర్ మాధ్యమం లో పెట్టేసి సెటైర్లు వేస్తున్నారు.

Video Advertisement

cyberabad police

ఈ మధ్య జనాలను ఆకట్టుకునే లా ప్రచారం చేయడం కోసం సైబరాబాద్ పోలీసులు వినూత్నం గా ఆలోచించి మీమ్స్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అలా ఇటీవల జరిగిన ఓ ఇన్సిడెంట్ ను మీమ్ లాగ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఆ మీమ్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇటీవల బైక్ పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. అది డేంజరస్.. మన రూల్స్ బైక్ పై ముగ్గురు జర్నీ చేయడాన్ని ఒప్పుకోవు కదా. అయినా వారు అలా ప్రయాణిస్తున్నారు. వెనకాల కూర్చున్న అమ్మాయి పోలీసులను గమనించింది.

cyberabad

నెంబర్ ప్లేట్ కనిపించకుండా ఉంచడానికి ఆమె కాలుని అడ్డం పెట్టింది. కానీ అది పూర్తి గా కవర్ అవ్వకపోవడం తో.. పోలీసులు ఆ బైక్ నెంబర్ ఉన్న వ్యక్తి కి ఝలక్ ఇచ్చారు. ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు గాను వారికి 1200 జరిమానా తో పాటు గా.. మరో పదిహేనొందలు అదనం గా విధించారు. వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోతే వందరూపాయలు మాత్రం విధించాల్సి ఉంది. కానీ, వీరికి డేంజరస్ డ్రైవింగ్ చేసినందుకు 1000 రూ, ఇది కాకుండా ఉద్దేశపూర్వకం గా కాలు అడ్డం పెట్టినందుకు మరో 500 రూపాయలను అదనం గా ఫైన్ విధించారు.

cyberabadd

ఈ విషయాన్నీ ట్విట్టర్ మాధ్యమం లో మీమ్ రూపం లో వివరించారు. ఇందుకోసం అత్తారింటికి దారేది సినిమాలోని క్లైమాక్స్ టెంప్లేట్ ను వినియోగించారు. మొత్తానికి సైబరాబాద్ పోలీస్ లు ఫుల్ టైం నిఘా పెట్టేస్తున్నారు. బండి తోలేటపుడు జర జాగ్రత్త గా ఉండండి బాస్..


End of Article

You may also like