Ads
అదృష్టం ఎప్పుడు ఎలా ఏ రూపంలో కలిసి వస్తుందో ఎవ్వరం చెప్పలేం. ఒక్కసారి అదృష్టం అలా తలుపు తట్టింది అంటే మాత్రం ఎవరి తలరాతలు ఎలా మారిపోతాయి ఎవ్వరూ చెప్పలేరు. అయితే.. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయేవారికి ఆ దేవుడు కూడా సాయం చేస్తుంటాడు అని చెప్తుంటారు.
Video Advertisement
అందుకు ఈ 60 ఏళ్ల వృద్ధ కూలీనే ఉదాహరణ. ఇతని స్టోరీ చూస్తే క్షణాల్లో బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది. ఇంతకీ అతని స్టోరీ ఏంటో చూసేయండి మరి.
కేరళలో కోజికోడ్ జిల్లాకు చెందిన ఈ 60 ఏళ్ల వ్యక్తి పేరు మమ్మిక్కా.. దినసరి కూలీగా పని చేసే మమ్మిక్కా అదే ప్రాంతంలో ఓ సాదా సీదా షర్ట్, లుంగీ కట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అయితే.. ఇతను సూపర్ మోడరన్ లుక్ తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతున్నాయి. ఫోటోగ్రాఫర్ షరీక్ వయాలీల్ ఇతనిని చూసి మోడల్ గా ఫీల్ అయ్యాడు. ఇతనికి సూటు-బూటు వేసి రెడీ చేసి, చేతిలో ఐపాడ్ పెట్టి ఫొటోస్ తీసాడు.
వాటిని తన ఫేస్ బుక్ పేజీ లో పెట్టాడు. అతని లుక్ చాలా బాగుండడంతో పాటు, అతని ఫోటోలకు ఓ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో షరీక్ అతనిని స్వంత వెడ్డింగ్ సూట్ కంపెనీకి మోడల్ గా ఎంచుకున్నాడు. దానితో మమ్మిక్కా దశ తిరిగిపోయింది. ఈ ఫోటోల గురించి ఫోటోగ్రాఫర్ షరీక్ మాట్లాడుతూ మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేసే నటుడు వినాయకన్‌ను పోలి ఉన్నాడని ప్రజలు చెప్పడంతో ఫేస్‌బుక్‌లో మమ్మిక్క ఫోటోలను పోస్ట్ చేసానని.. వీటికి మంచి స్పందన వస్తోందని చెప్పుకొచ్చాడు.
End of Article