దర్శన్ రీమేక్ చేసిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా..? తెలుగులో సూపర్ హిట్… మరి అక్కడ..?

దర్శన్ రీమేక్ చేసిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా..? తెలుగులో సూపర్ హిట్… మరి అక్కడ..?

by Harika

Ads

ఒక సినిమాకి రీమేక్స్ రావడం అనేది ఎప్పుడు జరుగుతున్న విషయం. కానీ ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే, ఎక్కువ శాతం భాషల్లో రీమేక్ చేస్తారు. అలాంటి సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి. అందులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. చాలా భాషల్లో ఈ సినిమా రీమేక్ అయ్యింది. ఈ సినిమాలాగానే మరొక సినిమా కూడా మిగిలిన భాషల్లో రీమేక్ అయ్యింది. ఆ సినిమానే మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Video Advertisement

darshan remake of this mahesh babu movie

ఇప్పటికి కూడా చాలా సినిమాలని కలెక్షన్స్ పరంగా కొలవాలి అంటే పోకిరి కొలమానంగా తీసుకుంటారు. సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ సినిమా సాధించిన ఇండస్ట్రీ హిట్ అలాంటి హిట్. ఈ సినిమా కూడా మిగిలిన భాషల్లో రీమేక్ చేశారు. తమిళ్ లో పొక్కిరి పేరుతో రీమేక్ చేశారు. విజయ్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ట్రోల్ అయినా కూడా తమిళ్ లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విజయ్ కి స్టార్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. హిందీలో ఈ సినిమా వాంటెడ్ పేరుతో రీమేక్ చేశారు. సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాని కన్నడలో కూడా రీమేక్ చేశారు. ఆ సినిమా పేరు పోర్కి.

ఈ సినిమాలో కన్నడ హీరో దర్శన్ హీరోగా నటించారు. ప్రణీత సుభాష్ హీరోయిన్ గా నటించారు. 2010 లో వచ్చిన ఈ సినిమాకి ఎం డి శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఏడు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించారు. సినిమా విడుదల అయ్యాక థియేటర్లలో ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇదే సినిమాని హిందీలో మై హు వాంటెడ్ పేరుతో, భోజ్‌పురిలో హమర్ బాయ్ దబాంగ్ పేరుతో విడుదల చేశారు. అక్కడ కూడా మంచి టాక్ సంపాదించుకుంది. కన్నడలో కూడా అలా ఈ సినిమాని రీమేక్ చేశారు. వి హరికృష్ణ ఈ సినిమాకి సంగీతం అందించారు. అలీ భాయ్ పాత్రలో ఆశిష్ విద్యార్థి నటించారు. తెలుగులో ఆశిష్ విద్యార్థి పోలీస్ పాత్రలో నటించారు. కానీ కన్నడలో అలీ భాయ్ పాత్రలో నటించారు. దేవరాజ్ ఏసీపీ పాత్రలో నటించారు. ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించారు.


End of Article

You may also like