దాసరి ఆస్తి వివాదం : నా ఇంటి గేటు నేను దూకితే తప్పేముంది ?…దాసరి అరుణ్‌

దాసరి ఆస్తి వివాదం : నా ఇంటి గేటు నేను దూకితే తప్పేముంది ?…దాసరి అరుణ్‌

by Anudeep

Ads

ప్రముఖ ధర్శకుడు దివంగత దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు ప్రభు, చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్ మధ్య ఆస్తి విషయంలో ఆస్తి గొడవలు చెలరేగాయి. అన్నదమ్ములు దాసరి ప్రభు, అరుణ్ కమార్.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.దీనిపై తాజాగా  దాసరి  అరుణ్ విలేకరుల సమావేశం లోమాట్లాడుతూ..ఆస్తికి సంభదించి వీలునామా ఉంటే చూపించాలి అని అంటూ దాసరి ప్రభు ని డిమాండ్ చేశాడు.ఏ  విషయం మీద న్యాయపరంగా వెళ్ళాలి అని వ్యక్తం చేసారు దాసరి అరుణ్. తన  అన్న మీద ఎలాంటి వివాదాలు లేవు అని తెలియజేసారు. కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అని దాసరి ఆరుణ్ తెలియజేసారు,

Video Advertisement

ఇది ఇలా ఉండగా ఈ నెల 24న రాత్రి దాసరి  అరుణ్‌ తన ఇంటి గేటు దూకి లోపలికి వచ్చి తనపై, తన కుటుంబసభ్యులపై దాడి చేశాడని దాసరి ప్రభు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు.దేనిపై సందించిన దాసరి అరుణ్ విలేకరుల సమావేశం లో నేను ఎస్‌ఐ సమక్షంలోనే తాను ఇంట్లోకి వెళ్లానని , నా ఇంటి గేటు నేను దూకితే తప్పేముంది ?  ఇంతకుముందు చాలాసార్లు గేటు దూకి వెళ్లానని చెప్పుకొచ్చారు.ఇంటి గేటు దూకిన సమయంలో మద్యం తాగలేదన్నారు.  ఆ ఇల్లు ఏ ఒక్కరిదో కాదని… తమ ముగ్గురిదన్నారు. వీలునామా ఉంటే కోర్టుకు చూపించాలన్నారు. తమ సోదరుడు ప్రభు చెప్పేవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. ఆరోపణలపై ఆధారాలుంటే నిరూపించాలన్నారుసినీ పెద్దలు జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కరించాలని కోరాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.


End of Article

You may also like