Ads
అత్త కోడళ్ల బంధం చాలా సున్నితం గా ఉంటుంది. అందుకే ఎక్కువ సందర్భాలలో గొడవలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓ కోడలు తన అత్తకు ఇలా లేఖ రాసింది. నా భర్తకు, నాకు మధ్య దూరం ఉండడానికే నీవే కారణమంటూ ఆ కోడలు అత్తతో చెప్తూ ఓ లేఖ ను రాసింది. ఈ లేఖను మీరు కూడా చదివి, ఇలా చెప్పచ్చో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Video Advertisement
అత్తామామలకు,
నేను మీ కోడలిని. మీ కూతురిలా మీరు చూసుకోవాల్సిన కోడలిని. మీరు మీ కూతురిలానే చెప్పుకుంటున్నారు కానీ నిజం గా అలా చూసుకుంటున్నారా..? నేనొక వ్యక్తిని. మీరు నన్ను అలా చూడడం లో విఫలం అయినప్పటికీ, నేను ఒక వ్యక్తినే.
నేను మీ కుటుంబానికి పోటీ కాదు. నేను మీ కొడుకుతో ప్రేమలో ఉన్న అమ్మాయిని – మీరు కోరుకున్నది అదే కదా? లేదా మీరు అతని కోసం ఓ పనిమనిషి మరియు మంచం పంచుకునే భాగస్వామిని మాత్రమే కోరుకుంటున్నారా? మీ కుటుంబ పేరును ముందుకు తీసుకెళ్లడానికి మాత్రమే గర్భం ఉందని మీరు భావిస్తున్నారా..?
మీ కొడుకు నిన్న అర్ధరాత్రి వరకు మీతో మాట్లాడుతూ నే ఉన్నారు. మీతో సమయం గడిపి ఆ తరువాత అతను మా గదికి వచ్చేసరికి అతని కళ్ళు అలసిపోయి , ఎరుపెక్కి ఉంటాయి. ఆ తరువాత అలసటతో నిద్రపోవడం తప్ప మా ఇద్దరికీ కలిసి గడపడానికి సమయం ఉండదు. మా మధ్య దాదాపుగా కమ్యూనికేషన్ లేదు. షాపింగ్ నుండి సమీప థియేటర్‌కు వెళ్లడం వరకు ప్రతిదీ కుటుంబ వ్యవహారం అయినప్పుడు, మాకు ఒకరికొకరు సమయం కేటాయించాలని మీరు ఎందుకు అనుకోరు..? మీరు నిద్రపోయాక మాకు సమయం దొరుకుతుందనుకుంటే.. అప్పటికే మేము అలసిపోతున్నాము.
భార్య భర్తలుగా మేమిద్దరం కలిసి సినిమాకి లేదా ఏదైనా టూరిస్ట్ ప్లేస్ కి వెళ్లాలని అనుకున్నా, ఆ తరువాత వారమే మీరు కూడా అక్కడకి మీ కొడుకు, నా భర్త అయిన అతనితో పాటు వెళ్లాలనుకుంటారు. మీకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం. కానీ, ఆ ఇష్టం అనేది మీకు మరియు నాకు అతనితో ఉండే బంధాన్ని బాలన్స్ చేసే విధం గా ఉండాలి. ప్రస్తుతం మా ఇద్దరి మధ్య బంధం ఒక చిన్న థ్రెడ్ తో వేలాడుతోంది. మా ఇద్దరి మధ్య కొన్ని మిలియన్ల అపార్ధాలు ఉన్నాయి. మీరు మా ఇద్దరికీ కొంత ఏకాంత సమయాన్ని ఇస్తేనే మేము వాటిని పరిష్కరించుకోగలము.
నేను ఎప్పుడు పుట్టింటికి వెళ్లాలని అనుకున్నా, మీ నుంచి ఎందుకు..? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. నేను మరి కొన్ని రోజులు గడపాలని అనుకున్నా, మీరు నన్ను అదే ప్రశ్న వేస్తారు. మీ కొడుకు మీతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నప్పటికీ, అతని జీవితం లో ఓ అమ్మాయి ఉందన్న విషయాన్నీ మీరు ఒప్పుకోలేరు. నా గది ఖాళి గా ఉండడాన్ని చూసి, నా తల్లి తండ్రులు ఎలా ఫీల్ అవుతారో.. మీరెప్పుడైనా ఆలోచించారా?
మీ కొడుకు నుండి ఒక అసభ్యకరమైన వ్యాఖ్య వినడం మీరు భరించలేరు, కాని అతను మీ ముందు నా తల్లిదండ్రులను అవమానించినప్పుడు, మీరు నిశ్శబ్దంగా ఉంటారు. మీరు ఎంత వంచన చేస్తున్నారో తెలుస్తోందా..? ప్రియమైన అత్తామామలారా, మీరు నా పట్ల ఇంత పక్షపాతాన్ని చూపిస్తున్నా , నేను ఈ ఇంట్లోనే ఎందుకు ఉంటున్నానో తెలుసా..? నేను మీ కొడుకుని ప్రేమించాను కాబట్టి. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ నాకు మీపై గౌరవం తగ్గిపోతోంది. మా సంబంధం తెగిపోకుండా ఉండడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను.
మీ కారణం గా మేము మానసికం గా చెదిరిపోయాము. నేను అతనికి తల్లిని కానీ, తండ్రిని కానీ కాలేను. అలానే, మీరు నాలా అతనికి భార్య కాలేరు. మీ స్థానమైనా, నా స్థానమైనా భర్తీ చేయలేనివి. అతన్ని ఎదో ఒక్కదాన్నే ఎంచుకోవాల్సి పరిస్థితిని దయచేసి తీసుకురావద్దు.
NOTE: All the images used in this article are just for representative purpose. But not the actual characters
End of Article