Ads
ముంబయి పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం గురించిన వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. ఆ మధ్య పాకిస్థాన్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడని, అందుకోసం అతని మొదటి భార్య జుబీనా జరీన్ విడాకుల ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
Video Advertisement
అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో ఎన్‌ఐఏ ముందు దావూద్ మేనల్లుడు దావూద్ రెండవ వివాహం చేసుకున్నట్లుగా తెలిపాడు. అయితే మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండానే పాకిస్థానీ పఠాన్ మహిళను రెండవ వివాహం చేసుకున్నట్లుగా దావూద్ సోదరి అయిన హసీనా పార్కర్ కొడుకు అలిషా పార్కర్ ఎన్‌ఐఏ ముందు వెల్లడించాడు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్య ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన కేసులో దావూద్ ఇబ్రహీం మరియు అతని సన్నిహితులపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసింది. దావూద్ ఇబ్రహీం దేశంలోని పవర్ ఫుల్ లీడర్లను, వ్యాపారులను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాడనే సమాచారం ఎన్‌ఐఏకు అందింది. దాంతో ఎన్‌ఐఏ విచారణలో భాగంగా దావూద్ ఇబ్రహీం హసీనా పార్కర్ సోదరుడు అలీషా పార్కర్ ను విచారించింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే, రెండవ పెళ్లి చేసుకున్నట్టుగా తెలిపినట్టుగా ఒక వార్తా సంస్థ వెల్లడించింది.
దావూద్ ఇబ్రహీం మొదటి భార్య పేరు జుబీనా జరీన్. ఆమె 1960లో ముంబైలో జన్మించారు. ఆమెకు మరో పేరు కూడా ఉంది. అదే మెహజబీన్ షేక్. 1990వ దశకంలో, జుబీనా జరీన్ దావూద్ ఇబ్రహీంను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఫోటోలు పబ్లిక్ డొమైన్ లో ఎక్కువగా లేవు. వీరి పెద్ద కుమార్తె మహర్ఖ్ ఇబ్రహీం, 2006 లో జావేద్ మియాందాద్ కుమారుడు అయిన జునైద్ మియాందాద్‌ను వివాహం చేసుకుంది. ఈ జంటకి ఒక పాప ఉంది.
జుబీనా జరీన్ రెండవ కుమార్తె, మెహ్రీన్ 2011లో పాకిస్థానీ-అమెరికన్ అయిన అయూబ్‌ను వివాహం చేసుకుంది. వీరికి మూడవ సంతానంగా 2012లో మరియా ఇబ్రహీం జన్మించారు. నివేదికల ప్రకారం జుబీనా 2017లో ముంబైకి వెళ్లి అక్కడ తన తండ్రి సలీం కాశ్మీరీని చూసింది. అయితే ఆమె తల్లి మరియు సోదరులు మరియు సోదరీమణుల గురించి ఇప్పటికీ ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
Also Read: ఉద్యోగం ఇప్పించమని “ప్రజావాణి” లో వేడుకున్న ఈ మహిళ ఎవరు..? అసలు ఉద్యోగం పోవడానికి కారణం ఏంటి..?
End of Article