ఉద్యోగం ఇప్పించమని “ప్రజావాణి” లో వేడుకున్న ఈ మహిళ ఎవరు..? అసలు ఉద్యోగం పోవడానికి కారణం ఏంటి..?

ఉద్యోగం ఇప్పించమని “ప్రజావాణి” లో వేడుకున్న ఈ మహిళ ఎవరు..? అసలు ఉద్యోగం పోవడానికి కారణం ఏంటి..?

by kavitha

Ads

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ప్రజా భవన్‌గా వేదికగా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వారంలో రెండు రోజులు, మంగళవారం, శుక్రవారాలలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్ణయించింది. దీంతో గత శుక్రవారం నాడు నిర్వహించిన ప్రజా దర్బార్ కి ప్రజల నుండి భారీ స్పందన వచ్చింది.

Video Advertisement

తెలంగాణ నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా భవన్‌కు చేరుకున్నారు. దాంతో ఆ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. గతంలో ఉద్యోగం కోల్పోయిన ఒక మహిళా హోంగార్డు తన జాబ్ ని మళ్ళీ ఇప్పించమంటూ, ప్రజా దర్బార్ కి వెళ్ళి తన బాధను వెళ్లబోసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రజా భవన్‌గా వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి భారీ స్పందన వస్తున్న విషయం తెలిసిందే. తమ సమస్యలను చెప్పుకోవడానికి శుక్రవారం నాడు భారీగా ప్రజలు తెల్లవారక ముందే ప్రజా భవన్‌కు వచ్చారు.  దాంతో  ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన వారిలో మహిళా హోంగార్డు మామిడి పద్మ కూడా ఉన్నారు. గత ప్రభుత్వం ఉన్న సమయంలో తన ఉద్యోగం పోయిందని, దానిని తిరిగి ఇప్పించమని అడగడానికి ఆమె ప్రజా దర్బార్ కి వచ్చారు.
ఉద్యోగం పోవడంతో జీవనోపాధి లేకుండా పోయిందని, దాంతో కుటుంబ పోషణ కూడా భారమైందని, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నందున తనకు మళ్లీ హోంగార్డు ఉద్యోగం ఇప్పించాలని ఆఫీసర్లను వేడుకుంటున్నారు. 2016లో తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగానికి భద్రత ఏర్పరచాలనే డిమాండ్‌తో హోంగార్డులందరు స్ట్రైక్ చేశారు. వారిలో గోదావరిఖనికి చెందిన మామిడి పద్మ కూడా ధర్నాలో పాల్గొని గత ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. అందుకు ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయింది. భర్త వదిలేయడం, ఉద్యోగం పోవడంతో ముగ్గురు పిల్లలను పోషించడం ఆమెకు సమస్యగా మారింది. తన జాబ్ ను తిరిగి ఇప్పించమని సీపీ, డీజీపీ, హోంమినిస్టర్ ను వేడుకున్నారు.
మామిడి పద్మ 2009లో వేములవాడలో హోంగార్డుగా జాయిన్ అయ్యారు. రెండేళ్ళ తర్వాత కరీంనగర్, గోదావరిఖనికి ట్రాన్స్‌ఫర్‌ పైన వెళ్లారు. తమ జీతాలు పెంచడంతో పాటు, ప్రతినెలా జీతాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ 7 ఏళ్ళ క్రితం ఇతర జిల్లాల నుండి వచ్చిన హోంగార్డులు గాంధీ ఆస్పత్రి దగ్గర ధర్నా చేశారు. దీనిలో పాల్గొన్నందుకు మామిడి పద్మ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. తన బాధను చెప్పుకోవడానికి ప్రజాదర్బార్‌కు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఉద్యోగాన్ని మళ్ళీ ఇప్పించాలని వేడుకున్నారు.

Also Read: వంట మనిషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్..! ఎందుకంటే..?

 

 


End of Article

You may also like