Ads
రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ప్రాజెక్ట్ K. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానిలు ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు.
Video Advertisement
ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ మరియు టీజర్‌ను కాలిఫోర్నియాలో నిర్వహించే కామిక్-కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్ లో పాల్గొనడం కోసం ప్రభాస్, కమల్ హాసన్, రానా, అక్కడికి చేరుకున్నారు. కానీ దీపికా పదుకొనే ఇందులో పాల్గొనడం లేదని అంటున్నారు. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ K మూవీని సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్ 2024లో జనవరి 12న రిలీజ్ కానుంది. హాలీవుడ్లో ప్రాజెక్ట్ కే సందడి మొదలైంది. మరి కొన్ని గంటల్లో ప్రాజెక్ట్ కే టైటిల్ గ్లింప్స్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్, కమల్ హాసన్, రానా వంటివారు అమెరికా చేరుకున్నారు.
ప్రాజెక్ట్ కే యూనిట్ కు స్వాగతం చెప్తూ అక్కడి వారు ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో దీపికా పదుకొనే సాండియాగోలో జరుగుతున్నఈ ఈవెంట్‌కు దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అది నిజమేనని, ప్రస్తుతం అక్కడ ‘హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్’ సమ్మె జరుగుతోంది. దీపికా పదుకొనే ఈ అసోసియేషన్‌లో మెంబర్ గా ఉన్నారు. సమ్మె జరుగుతుండడంతో అందులోని మెంబర్స్ అయిన నటీనటులు సినీ ఈవెంట్స్ కానీ, ప్రమోషన్స్ లో కానీ పాల్గొనకూడదని యూనియన్ పేర్కొంది. అందువల్ల ప్రాజెక్ట్ K ఈవెంట్‌కు దీపిక హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారట.
Also Read: ప్రభాస్ “ప్రాజెక్ట్-K” పోస్టర్ డిజైన్ వెనుక ఉన్న… ఈ వ్యక్తి ఎవరో తెలుసా..?
End of Article