ప్రభాస్ తో నటించడానికి “దీపికా” ఎంత తీసుకుంటుందో తెలుసా.?

ప్రభాస్ తో నటించడానికి “దీపికా” ఎంత తీసుకుంటుందో తెలుసా.?

by Megha Varna

Ads

బాహుబలి చిత్రంతో దేశమంతా ప్రభాస్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు.దీనితో ఇప్పుడు బాలీవుడ్ చూపు ప్రభాస్ వైపు మళ్ళింది…ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రం అనంతరం ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో నటించబోతున్నాడు.తమ సంస్థ స్థాపించి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ చిత్రాన్ని దాదాపు మూడు వందల కోట్లతో నిర్మించాలని వైజయంతి మూవీస్ సంస్థ భావిస్తుందట.

Video Advertisement

ఇది ప్రభాస్ 21వ చిత్రం.ఇందులో హీరోయిన్ గా మొదట చాలామంది పేర్లు వినిపించాయి కాని చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ దీపిక పదుకొనే ఫైనలైజ్ అయ్యింది.ఈ విషయాన్ని స్వయంగా దీపికనే ధృవీకరించారు.ఈ చిత్రానికి దీపిక రెమ్యూనరేషన్ డబ్బుల రూపంలో కాకుండా హిందీ రైట్స్ లో వాటాగా తీసుకుంటుందట.

ఈ రకంగా ప్రభాస్ కున్న క్రేజ్ ను దీపిక క్యాష్ చేసుకోబోతుందని సినీ వర్గాలలో చర్చ జరుగుతుంది.ఒకవేళ ఇది నిజమైతే దీపిక ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కు రెండింతలు లాభం సంపాదిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జానపద కథాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా ఉదృతి తగ్గక పట్టాలెక్కనున్నది


End of Article

You may also like