96 సినిమాలో “డిలీట్” చేసిన ఆ ఒకే ఒక్క సీన్ ఏంటో తెలుసా..? “విజయ్ సేతుపతి” అలా అనడంతో..?

96 సినిమాలో “డిలీట్” చేసిన ఆ ఒకే ఒక్క సీన్ ఏంటో తెలుసా..? “విజయ్ సేతుపతి” అలా అనడంతో..?

by kavitha

2018లో విడుదలైన ప్రేమకధా చిత్రం 96. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కథ అంటూ ప్రత్యేకంగా లేదు. చదువు రోజుల్లో ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికులు విడిపోయి, కొన్ని ఏళ్ల తరువాత తిరిగి కలుస్తారు.

Video Advertisement

ఆ నేపద్యంలో తెరకెక్కిన సినిమానే 96. ఈ సినిమా విజయాన్ని పొందింది. ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రంలో త్రిష, విజయ్‌ సేతుపతి లిప్ లాక్ సన్నివేశాన్ని తొలగించారంట. అది కూడా విజయ్‌ సేతుపతి వద్దని చెప్పడం వల్లనే తొలగించారు. మరి విజయ్ సేతుపతి ఎందుకు వద్దని చెప్పారో ఇప్పుడు చూద్దాం..
రామచంద్రన్, జానకి దేవి ఇద్దరు 10వ తరగతి వరకు ఒకే స్కూల్ లో కలిసి చదువుకుంటారు. ఆ క్రమంలో ఇద్దరు  ప్రేమించుకుంటారు. కొన్ని సమస్యల వల్ల రామ్ టెన్త్ క్లాస్ తర్వాత ఫ్యామిలీతో  చెన్నైకి వెళ్తాడు. ఆ తరువాత ఇద్దరు మళ్ళీ కలుసుకోరు.  22 ఏళ్ల తరువాత ట్రావెల్ ఫోటోగ్రాఫర్‌ అయిన రామ్ తన చిన్ననాటి ప్రదేశాలను, స్నేహితులను  చూడటానికి తన సొంతూరు అయిన తంజావూరుకు వెళ్తాడు. ఆ క్రమంలో ఫ్రెండ్స్  ఏర్పరు చేసిన గెట్‌ టు గెదర్‌ పార్టీలో ప్రేమికులు ఇద్దరు కలుస్తారు. అయితే ఆమెకి వివాహం అవుతుంది.
ఆ సమయంలో వారు హోటల్ రూమ్ లో కబుర్లు చెప్పుకుంటారు. రోడ్డు మీద నడవడం, మెట్రోలో ప్రయాణిస్తూ తమ మధ్య అనుబంధాన్ని తెలుపుకుంటారు. వారి మధ్య వచ్చే సన్నివేశాలు వారి మధ్య అనుబంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్నివేశాలన్నీ కూడా  చాలా సహజంగా, హృద్యంగా చిత్రీకరించారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో ఎయిర్‌పోర్ట్‌లో జాను, రామ్ విడిపోయే సన్నివేశంలో మొదట లిప్ లాక్ ఉంది. అయితే ఆ తరువాత వద్దనుకున్నారు.
ఈ విషయం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఈ సినిమాని చూస్తున్న ఆడియెన్స్  పాత జ్ఞాపకాల్లోకి వెళతారని, వారికి మంచి అనుభూతిని పంచుతుంది. పెళ్లి అయిన అమ్మాయితో లిప్ లాక్ సన్నివేశం పెడితే జస్టిఫై అవదని భావించి, చాలా సార్లు చర్చించుకుని హీరో, హీరోయిన్ ను టచ్ చేయకూడదని నిర్ణయించుకున్నామని విజయ్ సేతుపతి వెల్లడించారు.
Also Read: ఈ వారం OTT లో విడుదల కాబోతున్న 15 సినిమాలు..! ఏ సినిమా / సిరీస్ ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?


You may also like