Ads
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా అల వైకుంఠపురంలో. 2020 మొదటిలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, తమన్ అందించిన సంగీతం, కొరియోగ్రఫీ ఇలా సినిమాలో ఉన్న ప్రతి అంశం ప్లస్ పాయింట్ అయ్యాయి. ఈ సినిమా పాటలు అయితే యూట్యూబ్ లో రికార్డుల సెన్సేషన్ సృష్టించాయి.
Video Advertisement
ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. సినిమా నిడివి ఎక్కువ అవ్వడంతో లేదా మరి వేరే కారణాల వల్ల ఈ సినిమాలోని కొన్ని సీన్స్ డిలీట్ చేశారు. అందులో కొన్ని సీన్స్ ఆల్రెడీ విడుదల చేశారు. ఒక సీన్ మాత్రం ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకున్న గోల్డ్ మైన్స్ టెలి ఫిలిమ్స్ వాళ్ళు విడుదల చేశారు.
ఇందులో అల్లు అర్జున్, పూజా హెగ్డే తో పాటు సుశాంత్, నివేతా పేతురాజ్ కూడా ఉంటారు. హీరోయిన్ ఆఫీస్ లో ఉన్నప్పుడు ఈ సీన్ జరుగుతుంది. ఈ సీన్ హీరోయిన్ కి సుశాంత్ కి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వస్తుంది. ఇందులో హీరోయిన్ ని కలవడానికి సుశాంత్ నివేదా పేతురాజ్ వస్తారు. వారిద్దరూ హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటారు. కానీ హీరోయిన్ వారిని కలవడం ఇష్టం లేక ఏదైనా మార్గం ఆలోచించమని హీరో కి చెప్తుంది.
అప్పుడు హీరో రాహుల్ రామకృష్ణ నవదీప్ ని తీసుకువచ్చి ఒక మీటింగ్ ఉంది అని చెప్తాడు. కానీ వారు తడబడడం తో హీరోయిన్ తో మాట్లాడుతున్న సుశాంత్, నివేతా పేతురాజ్ కి విషయం అర్థమవుతుంది. అక్కడే ఉన్న హీరో కూడా తనకు అబద్ధం చెప్పడం అస్సలు చేతకాదు అనడంతో వారిద్దరికీ విషయం అర్ధమయ్యి వెళ్ళిపోతారు. వారు వెళ్లిపోయిన తర్వాత హీరోయిన్ హీరోని కొడుతూ ఉంటుంది. ఈ సీన్ మనకి సినిమాలో డిలీట్ చేశారు. కానీ ఇప్పుడు విడుదల చేశారు.
watch video :
https://www.instagram.com/p/CcFO38tKavU/?utm_source=ig_embed&ig_rid=5071e980-82db-4b28-b86b-1fa967799c44
End of Article