ఢిల్లీ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా… 72 కుటుంబాలు, 17 మంది డెలివరీ బాయ్స్ క్వారెంటైన్ లో..!

ఢిల్లీ పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా… 72 కుటుంబాలు, 17 మంది డెలివరీ బాయ్స్ క్వారెంటైన్ లో..!

by Anudeep

Ads

నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం .. ప్రస్తుతం భారతదేశంలో ఎంత పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికి కేవలం మనుషుల నిర్లక్ష్యం మూలంగానే కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. నిన్నటికి నిన్న ఒక పిజ్జా డెలివరీ బాయ్ మూలంగా డెబ్బై రెండు కుటుంబాలు, 17మంది డెలివరీ బాయ్ లను ఇబ్బందుల్లోకి నెట్టేసిన పరిస్థితి ఎదురైంది. ఢిల్లిలో జరిగిన ఈ సంఘటన వివరాలు.

Video Advertisement

ఢిల్లీలోని మాల్వియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. అతడు డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. సుమారు 20రోజుల నుండి కరోనా లక్షణాలు ఉన్నప్పటికి ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. అతన్ని వెంటనే ఢిల్లీలోని కోవిడ్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్న హాస్పిటల్ కి తరలించారు. దాంతో అతడు గత ఇరవై రోజులుగా ఎక్కడెక్కడ ఎవరెవరకి డెలివరి ఇచ్చాడు అనే దిశలో దర్యాప్తు ప్రారంభించారు.

సుమారు 72 కుటుంబాలకు అతడు పిజ్జాలు ఆర్డర్ ఇచ్చినట్టుగా ఆ దర్యాప్తులో తేలింది. దాంతో ఆ కుటుంబాలలో కలవరం స్టార్టయింది. మొత్తం అన్ని కుటుంబాలని హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు కోరారు. మరోవైపు అతడితో పని చేసిన పదిహేడు మంది డెలివరీ బాయ్ లను కూడా క్వారంటైన్ కి తరలించారు. ఫూడ్  డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్స్ మాస్క్స్ ధరించి ఉన్నందున భయపడాల్సిన పని లేదని అధికారులు చెప్తున్నారు.

ఇదిలా ఉండగా  భారత్లో ఇప్పటివరకు 12,456 కేసులు నమోదవగా, వాటిల్లో మహారాష్ట్ర మొదటి స్థానం, ఢిల్లి రెండవస్థఆనంగా ఉన్నాయి.ఢిల్లిలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి..ఇప్పటివరకు సుమారు 1500 కేసుల వరకు పాజిటివ్ గా నిర్దారించబడింది.


End of Article

You may also like