పూర్ణకు కాబోయే భర్త ఎవరో తెలుసా..? సెలెబ్రెటీల్లో కూడా ఈ అబ్బాయికి చాలానే ఫాలోయింగ్ ఉందిగా..!

పూర్ణకు కాబోయే భర్త ఎవరో తెలుసా..? సెలెబ్రెటీల్లో కూడా ఈ అబ్బాయికి చాలానే ఫాలోయింగ్ ఉందిగా..!

by Anudeep

Ads

తెలుగు సినిమా తెరపై హీరోయిన్ గా వెలుగు వెలిగిన నటి పూర్ణ ప్రస్తుతం “ఢీ” షో కు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జడ్జిగా స్టేజి పై పూర్ణ చేసే అల్లరి మాములుగా ఉండదు. కంటెస్టెంట్ల పెర్ఫార్మన్స్ లు నచ్చితే బుగ్గ కొరకడం లాంటి అల్లరి చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి అభిమానుల విమర్శలు కూడా ఎదుర్కొంటు ఉంటారు.

Video Advertisement

అయితే.. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న నటి పూర్ణ సడన్ గా తనకి కాబోయే శ్రీవారిని పరిచయం చేసారు. దీనితో ఈ వార్త నెట్టింట్లో వైరల్ అయింది. ఇప్పుడు పూర్ణ ఫ్యాన్స్ అందరు కలిసి ఆ అబ్బాయి ఎవరు అన్న సంగతి తెలుసుకునే పనిలో పడ్డారు.

poorna 1

సడన్ గా నటి పూర్ణ తనకు ఎంగేజ్మెంట్ అయిపొయింది అని ప్రకటించి అభిమానుల గుండెల్లో బాంబ్ పేల్చారు. అయితే.. అందాల నటి పూర్ణకు కాబోయే శ్రీవారు ఎవరా..? అన్న చర్చ మాత్రం సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. పూర్ణ చేసుకోబోయే వ్యక్తి పేరు షానిద్ అసిఫ్ అలీ. ఆయన యూఏఈ బేస్డ్ వ్యాపారవేత్త. అయితే ఆయన మూలాలు కేరళలో ఉన్నాయని.. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. ఆయన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సీఈఓ, ఫౌండర్. జమా అల్మెహరి అనే మరో కంపెనీని కూడా స్థాపించారని తెలుస్తోంది.

poorna 2

ఈ సంస్థ ద్వారా ఆయన ఆఫీసుల ప్రారంభానికి కావాల్సిన సర్వీస్ లను అందిస్తుంటారు. ఆయన ప్రముఖంగా సెలెబ్రెటీలకు వీసాలను అందిస్తూ ఉంటారు. ఫ్లైట్ టికెట్స్ బుకింగ్, వీసా సర్వీసులను ఆయన కంపెనీ అందిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఆయన చాలా మంది మూవీ సెలెబ్రెటీలకు సైతం వీసాలను అందించారు. కాజల్, ప్రణీత, ప్రియమణి, శ్వేతా మీనన్, విజయ్ సేతుపతి, ఆండ్రియా, నాజర్, లక్ష్మి వంటి ఎందరో సెలెబ్రిటీలు ఆయన వద్ద నుంచి వీసా అందుకున్నారు. కేరళ సినీ సెలెబ్రిటీలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయట.

poorna 3

మరో వైపు ఎన్నారై ఎంట్రప్రెన్యూర్ గా కూడా ఆయన కేరళ సీఎం నుంచి అవార్డు అందుకున్నారు. ముస్లిం మత పెద్దలతో కూడా ఎన్నో పరిచయాలు ఉన్న ఆయన దుబాయ్ లో లగ్జరీ లైఫ్ స్టయిల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలంగానే ఆయనకు పూర్ణ ఫ్యామిలీతో మంచి అనుబంధాలు ఉన్నాయి. పూర్ణకి కూడా ఆయన యూఏఈ వీసాను అందించారు. కేరళకు చెందిన ఓ సినిమా వేడుకలో కూడా వీరిద్దరూ పాల్గొన్నారు. వీరిద్దరికి ముందునుంచే మంచి స్నేహబంధం ఉందని.. అది ప్రేమగా మారిందని తెలుస్తూనే ఉంది. అయితే పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. చూడచక్కని ఈ జంటని చూసి అభిమానులు కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు.

అయితే త్వరలో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంది అనుకునే టైంలో తాజాగా ఇప్పుడు తన పెళ్లి జరగడం లేదని న్యూస్ నెట్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం కొన్ని పర్సనల్ రీసన్స్ వల్ల మాత్రమే ఈ పెళ్లి క్యాన్సిల్ అయింది అని కొందరి అభిప్రాయం. అయితే దీనిపై స్పందిస్తూ పూర్ణ ఒక పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ నావాడు’ అనే క్యాప్షన్ తో తనకు కాబోయే భర్త షానిద్ ఆసిఫ్ అలీతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసారు. దీంతో ఈ పెళ్లి కాన్సల్ అనే రూమర్స్ కి చెక్ పెట్టారు.


End of Article

You may also like