Ads
కొడుకు అంత స్టార్ హీరో అయినా.. యష్ తండ్రి ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజిఎఫ్ మానియా కొనసాగుతోంది. సినిమా రిలీజ్ తోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మూవీతో భాషతో సంబంధం లేకుండా హీరో యష్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
Video Advertisement
ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి యష్ ఇంతటి స్థాయికి చేరుకొని పేరు సంపాదించడం కోసం ఆయన పడ్డ కష్టాలు చెప్పుకుంటే తీరవు. తాజాగా… విడుదల అయిన కెజిఎఫ్ రెండవ చాప్టర్ కూడా ఓ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబడుతోంది. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యష్ తన ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు.
తనది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పుకొచ్చారు. తన తండ్రి బస్ డ్రైవర్ గా పని చేస్తారని చెప్పుకొచ్చారు. అయితే తాను సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం లేదన్నారు. సినిమాలు అందరికి అచ్చిరావని ఆయన భావించే వారన్నారు. అయితే.. నా ఇష్టాన్ని కాదనలేక నన్ను సినిమాల్లోకి వెళ్ళడానికి ఒప్పుకున్నారన్నారు. చేతిలో మూడొందల రూపాయలు పెట్టి సినిమాల్లోకి పంపించారు. ఒకవేళ అవకాశాలు రాకపోతే ఎదో ఒక పని చేసుకుందామన్నారు.
అయితే యష్ సినిమాల్లోకి వచ్చాక కెజిఎఫ్ సినిమాతో చాలా ఫేమస్ అయిపోయారు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యి మంచి కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా మంచి పేరు తెచ్చి యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కొడుకు ఇంత పెద్ద స్టార్ హీరో అయినా ఆయన తండ్రి మాత్రం ఇంకా బస్సు డ్రైవర్ గానే పని చేస్తున్నారు.
End of Article