Ads
సినిమా ఇండస్ట్రీలో సినిమాలు వాయిదా పడటం అనేది మామూలే. ముందుగా ఒక డేట్ ప్రకటిస్తారు కానీ ఆ డేట్ కి ఆ సినిమాలు రావచ్చు రాకపోవచ్చు. సినిమాలు వాయిదా పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి. సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం లేదా, ఆ టైం కి వేరే ఏదో జరగడం లాంటివి మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ప్రభాస్ సలార్ సినిమా విషయంలో ఇదే జరిగింది.
Video Advertisement
ఇప్పుడు తెలుగులో రాబోతున్న రెండు పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడుతున్నాయి అనే వార్త బాగా వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మామూలుగా అయితే ఏప్రిల్ 5న విడుదలవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్ 16వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేయాలనుకుంటున్నారట. అదే కాకుండా సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీని మూలంగా ఈ సినిమాని ఆగస్టు 15 కి వాయిదా వెయ్యాలి అని అనుకుంటున్నారు. అయితే ముందుగా ఆగస్టు 15న వస్తున్నట్లు ప్రకటించిన అల్లు అర్జున్ పుష్ప2 సినిమా కూడా డిసెంబర్ కి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ డిలే కావడంతో ఆగస్టు 15 కి రావడం కష్టంగా తెలుస్తుంది.
ఇక ఏప్రిల్ 5న దేవర మూవీ రాకపోతే అప్పుడు విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక టిల్లు స్క్వేర్ మూవీ కూడా ఫిబ్రవరి 9 నుండి వాయిదా పడిన సంగతి తెలిసింది. ఈ సినిమా కూడా మార్చి ఆఖరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ విషయాల్లో స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
End of Article