“దేవి శ్రీ ప్రసాద్” కి ఏమయ్యింది..? ఇలా అయిపోయారేంటి..?

“దేవి శ్రీ ప్రసాద్” కి ఏమయ్యింది..? ఇలా అయిపోయారేంటి..?

by Harika

Ads

1999లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమా తో మ్యూజిక్ డైరెక్టర్ గా జర్నీ స్టార్ట్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న దేవి శ్రీ ప్రసాద్ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఒక రేంజ్ మ్యూజిక్ అందించి మ్యూజిక్ ప్రియులని మెస్మరైజ్ చేశాడు. సంగీత ప్రపంచంలో ఆయన ఒక బ్రాండ్. మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా మ్యూజిక్ ట్యూన్స్ క్రియేట్ చేస్తుంటాడు.

Video Advertisement

ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాతో ఇండియాని ఒక ఊపు ఊపేశారు దేవి శ్రీ ప్రసాద్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్, కోలీవుడ్ వరకు అన్ని భాషలలోని ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కోసం నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజాను గురువుగా భావిస్తూ ఉంటారు. ఆయన స్ఫూర్తితోనే సంగీత దర్శకుడిగా ఎదిగానని చెప్పుకుంటారు.

తన స్టూడియోలో ఇళయరాజా గారిది పెద్ద ఫోటో ఒకటి పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటారు దేవి శ్రీ ప్రసాద్. తన గురువుగారు ఎప్పుడైనా అతను స్టూడియోకి వస్తే ఆ ఫోటో ముందు గురువుగారితో కలిసి ఫోటో దిగాలి అనేది అతని చిరకాల వాంఛ. అయితే ఇటీవల తన గురువు అయిన ఇళయరాజా దేవి శ్రీ ప్రసాద్ స్టూడియోని సందర్శించారు. అప్పుడు గురువు గారితో ఫోటో తీయించుకొని తన కల ఇన్నాళ్లకు నెరవేరిందని ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు దేవి శ్రీ ప్రసాద్.

devi sri prasad new look

అయితే ఇందులో దేవి లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఆయన ఫ్యాన్స్. చాలా సన్నగా, పీలగా, గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన దేవి శ్రీ ప్రసాద్ ని చూసి ఏమైందో అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా భోజనం చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తండేల్ టీం మేకర్స్ విషెస్ చెప్తూ ఒక సరికొత్త వీడియోను షేర్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ తన సిల్వర్ జూబ్లీ వేడుక పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.


End of Article

You may also like