ఒకవైపు కరోనా గురించి భయంగా ఉన్నా, మరోవైపు  మనుషుల్లో మంచితనం, మానవత్వం చనిపోలేదని అడుగడుగునా నిరూపితమవుతుంటే మనసంతా సంతోషంతో నిండిపోతోంది. ముఖ్యంగా పోలీసులంటే ప్రజలకు ఉన్న భయం, ఖాకీలు అంటే కసాయి వాళ్లే అనే ఆలోచన మారిపోతున్నాయి..ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే డిజిపి సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్లో ఒక అమ్మకు సెల్యూట్ చేయడం వైరల్ గా మారింది..ఇంతకీ ఆ అమ్మ ఎవరూ? డిజిపి ఎందుకు సెల్యూట్ చేశారు?

Video Advertisement

లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజల బాగు కోసం పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు. పోలీసుల కష్టం చూసి చలించిపోతూ ఎవరికి వారే వారికి తోచిన సాయం చేస్తున్నారు. అలాగే  లోకమణి అనే అమ్మ, ఒకరోజు తనకొచ్చే జీతం డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్తూ, వచ్చేటప్పుడు పోలీసులకి రెండు కూల్ డ్రింక్ బాటిల్లు తీసుకొచ్చి, తాగండి బాబూ, మాకోసం కష్టపడుతున్నారు కదా అని ఇచ్చింది.. అమ్మా , మాకొద్దు ఇంటికి తీస్కెల్లండి అంటూ తను తెచ్చిన కూల్ డ్రింక్ బాటిల్స్ కి మరో రెండు బాటిల్స్ ఇచ్చి పంపించారు.

నిజానికి ఆ అమ్మ జీతం మూడువేల రూపాయలు, స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది . సాయం చేయడానికి మన దగ్గర వేలకు వేలు డబ్బుండక్కర్లేదు .చేయాలనే ఆలోచన ఉంటే చాలు అని నిరూపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ వీడియో చూసిన ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ . ఆమె ఎవరో తెలుసుకుని ఆమెతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి తనకు సెల్యూట్ చేసి తద్వారా కృతజ్ణతలు తెలిపారు.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోని ఒకే గాటన కట్టేయలేం..కొన్ని మనల్ని నవ్విస్తే, కొన్ని చిరాకు తెప్పిస్తాయి..కొన్ని మన మనసు పొరల్ని తడిమి కంటి తడి పెట్టిస్తాయి . పోలీసుల కష్టాన్ని చూసి చలించిపోయిన ఆ అమ్మ, ఆ అమ్మ ప్రేమకి మురిసిపోయిన పోలీసులు.. ఆ అమ్మ ఎవరో తెలుసుకుని మరీ తనకు సెల్యూట్ చేసిన డిజిపి.. నిజంగా ఎవరికి వారే ప్రత్యేకం…ఆ అమ్మకి, డిజిపికి  మా తెలుగు అడ్డా తరపున సెల్యూట్..

watch video: