జబర్దస్త్, అదిరింది షోల వెనకున్న అసలు కథ బయటపెట్టిన ధన్రాజ్..ఫస్ట్ స్కిట్ తనదే కానీ?

జబర్దస్త్, అదిరింది షోల వెనకున్న అసలు కథ బయటపెట్టిన ధన్రాజ్..ఫస్ట్ స్కిట్ తనదే కానీ?

by Anudeep

Ads

జబర్దస్త్ షో నుండి నాగబాబు తప్పుకోవడం అందరికి షాకింగ్ . నాగబాబు పోతే పోయాడు కాని కంటస్టంట్స్ ని తీసుకుపోయాడు . జబర్దస్త్ ని దెబ్బ తీయడానికే ఈ ప్లాన్ చేశాడని ఎన్నో కామెంట్స్ వచ్చాయి. అలాంటి కొన్ని కామెంట్స్ కి చెక్ పెడుతూ జబర్దస్త్ మాజి కంటెస్టంట్, నటుడు ధనరాజ్ కొన్ని ఆసక్తి కరమైన విషయాలు చెప్పారు.

Video Advertisement

జబర్దస్త్ తో నాగబాబు , రోజాలకి జన్మజన్మల సంబంధం అనేవాళ్లు. దానికి కారణాలు లేకపోలేదు షోలో కంటెస్టంట్స్ మారుతున్నా జడ్జిలుగా మాత్రం వీరిద్దరే. ఎన్నో షోస్ కి జడ్జిలుగా ఎందరో వచ్చి పోతున్నా ఈ షోకి మాత్రం జడ్జిలుగా వీరిద్దరే. జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్ ఇలా వారంలో రెండు సార్లు ప్రసారం అయ్యే షోలకి జడ్జిలు వీరిద్దరే. ఎలక్షన్స్ పేరుతో రోజా దూరం అయినా, అనారోగ్యం అని నాగబాబు దూరం తాత్కాలికమే. మళ్లీ ఆ చెయిర్స్ లో స్థానం వారిద్దరిదే .

అలాంటిది నాగబాబు ఉన్నట్టుండి షో నుండి తప్పుకున్నారు. అంతేకాదు మరొక ఛానెల్లో  అదిరింది అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. నాగబాబుతో పాటు జబర్దస్త్ డైరెక్టర్లు, ఆర్టిస్టులు కూడా అదిరింది షోకి క్యూ కట్టారు. ఇక్కడి టీం మొత్తం అక్కడ పని చేస్తున్నప్పటికి జబర్దస్త్ అంత హిట్ కాలేకపోతోంది.మరోవైపు జబర్దస్త్ పాత స్కిట్స్ ప్లే చేసుకుంటూ టిఆర్పి మాత్రం తగ్గనివ్వట్లేదు.

ఇదిలా ఉంటే  జబర్దస్త్ తొలి కంటెస్టంట్ ధనరాజ్ చెప్పిన విషయం ఏంటంటే “ సినిమాలు చేస్కుంటున్నప్పుడు ఏడుకొండలు పిలిచి కాన్సెప్ట్ చెప్పాడు, కొన్ని ఎపిసోడ్సే అన్నాడు. అలా జబర్దస్త్ స్టార్ట్ అయింది .తొలి స్కిట్ నాదే, నేనే ఎందరో కొత్త వారిని తీసుకొచ్చాను అని చెప్పుకొచ్చాడు.

తర్వాత నేను తప్పుకుని సినిమాలు చేసుకుంటూ , మళ్లీ జబర్దస్త్ వైపొద్దామనుకున్నా అప్పటికే కొత్తవాళ్లతో నిండిపోయింది. ఆ టైంలో అడగడం బాగోదని ఊరుకున్నాను. ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అయినప్పుడు వెళ్లి అడిగితే ఉన్నవాళ్లని తీసేయలేమని అన్నారు. ఆ గ్యాప్ పెరుగుతూనే వచ్చింది.

మళ్లీ ఇన్నాళ్లకి నాగబాబు గారే డైరెక్ట్ గా కాల్ చేసి అదిరిందికి రమ్మని అడిగారు. ఇప్పుడు మేం సంపాదించిన ఇళ్లు, కార్లు , సౌకర్యాలు అంతా నాగబాబు గారి వల్లే . అలాంటిది నాగబాబు గారే స్వయంగా పిలిస్తే ఎలా కాదనగలం. అందుకే మారు మాట్లాడకుండా అదిరింది షో చేయడానికి ఒప్పుకున్నానని చెప్పుకొచ్చాడు.


End of Article

You may also like