Ads
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రతి సంవత్సరం రెండు మూడు సినిమాలైనా రిలీజ్ చేస్తూ ఉంటారు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. సంక్రాంతికి ఆయన నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్ లో విడుదలైంది. సంక్రాంతి సినిమాలో పోటీ కారణంగా తెలుగులో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ రోజు తెలుగులో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది… ధనుష్ కి మరో హిట్టు దక్కిందా లేదా అనే విషయాన్ని ఒకసారి చూద్దాం…!
Video Advertisement
- చిత్రం : కెప్టెన్ మిల్లర్
- నటీనటులు : ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, నివేదిత సతీష్ తదితరులు
- నిర్మాణ సంస్థ : సత్య జ్యోతి ఫిలిమ్స్
- దర్శకత్వం : అరుణ్ మతీశ్వరన్
- సంగీతం : జీవి ప్రకాశ్ కుమార్
- విడుదల తేదీ : జనవరి 26, 2024
స్టోరీ :
1930 లో సవంతంత్రం రాకముందు బ్రిటీష్ వాళ్లు భారత్‌ని ఆక్రమించుకుని నెమ్మదిగా ఒక్కో రాజ్యాన్ని తమ కంట్రోల్ లోకి తీసుకుంటున్న రోజులవి.తమిళనాడులోని ఓ గ్రామంలో అగ్నీశ్వర(ధనుష్) ఉంటాడు. అతను సైన్యం చేరుతాడు. సైన్యంలో అతడికి మిల్లర్ అనే పేరు పెడతారు. ఆ సమయంలో దొరలు పాలించే ఓ రాజ్యంలో దళితులు, పేదవాళ్లు కలిసి దొర(జయప్రకాష్) ఆధ్వర్యంలో ఓ గుడిని నిర్మిస్తారు. కానీ ఆ గుడిలోకి అక్కడి వారికి అనుమతి లేదు. ఈ కులవివక్ష చూసే ఆయుధాలు ఇస్తున్నారని అందరి మాట కాదని అగ్నిశ్వర సైన్యంలో చేరుతాడు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత తన పై అధికారిని చంపేస్తాడు. తర్వాత అతను తప్పించుకోడానికి తోటి సైనికుడు రఫిక్ (సందీప్ కిషన్) సహాయం చేస్తాడు.
తర్వాత అగ్నిశ్వర మిల్లర్ దొంగగా మారతాడు. దొంగల ముఠాలో చేరుతాడు. బ్రిటిష్ వారి కుట్రలను అంతు చేయాలి అనుకుంటాడు. అదే సమయంలో వీళ్ళ ఊరిలో ఉండే గుడిలో విగ్రహాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ విగ్రహం తీసుకొస్తే ఆలయంలో ప్రవేశం కలిపిస్తానని దొర అంటాడు. తన సైన్యంతో ఆ విగ్రహాన్ని తీసుకొని రావడానికి వెళ్తాడు మిల్లర్. తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
రివ్యూ :
ఈ సినిమా కథ కొత్తది ఏం కాదు. స్వాతంత్య్ర పోరాటం బ్యాక్ డ్రాప్ తో చాలా సినిమాలే వచ్చాయి. సినిమా ఫస్ట్ హాఫ్ లో అగ్నీశ్వర లైఫ్‌ను చక్కగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమాలో దొరల పాలన, కుల వివక్ష వరకు చూపించి ఉంటె బాగుండేది. బ్రిటిష్ వాళ్ళని స్టోరీలో యాడ్ చేయడం సినిమాకి మైనస్ అయ్యింది. ఈ కథని ఇంకా బాగా తెరకెక్కించచ్చు. ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ సీన్ ఈ సినిమాకి హైలైట్. జీవీ ప్రకాశ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.
అగ్నీశ్వర, శివన్న మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు, డైలాగ్స్ బాగున్నాయి. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ధనుష్ మరోసారి తన పెర్ఫార్మన్స్ తో రెచ్చిపోయారు. వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ తో ధనుష్ బాగా అలరించారు. శివరాజ్ కుమార్ సందీప్ కిషన్ పాత్రలు కూడా కథలో కీలకంగా వస్తాయి. ప్రియాంక మోహన్ తన పరిధి మేరకు బాగా నటించింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి తగ్గట్టు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. ధనుష్ పెర్ఫార్మన్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అయితే అన్ని సెక్టార్ల ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్. ఫైనల్ గా… ధనుష్ నటించిన అసురన్, కర్ణన్ సినిమాలు నచ్చితే ఈ సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్ :
- ధనుష్ వన్ మ్యాన్ షో
- ఎలివేషన్స్
- ఇంటర్వెల్ ఫైట్ సీన్
- బిజీఎమ్
మైనస్ పాయింట్స్:
- కొత్త కథ ఏం కాదు
- స్లో ఫస్ట్ హాఫ్
రేటింగ్ : 2.75 / 5
watch trailer :
End of Article