Sudheer: సుధీర్, రష్మీ లేకపోతే.. “ఢీ” షో రేటింగ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయో చూడండి..!

Sudheer: సుధీర్, రష్మీ లేకపోతే.. “ఢీ” షో రేటింగ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయో చూడండి..!

by Anudeep

Ads

ప్రతి బుధవారం ఈ టీవీ లో టెలికాస్ట్ అవుతూ టాప్ టీఆర్పీ తో దూసుకుపోయే డాన్స్ షో ఢీ. అయితే ఈ మధ్య ఈ షో లో చాలా మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. గత కొన్ని సీజన్ల నుండి ఢీ ప్రోగ్రాంలో అలరించిన సుధీర్ ఇక పై ఈ ప్రోగ్రాం లో కనిపించట్లేదు.

Video Advertisement

మొదట్లో కొంతకాలమే ఆయన షో నుంచి దూరంగా ఉంటారు.. తిరిగి మళ్ళీ కనిపిస్తారు అని అనుకున్నా.. అది జరగలేదు. తాజాగా ప్రసారం అవుతున్న షో లో సుధీర్, రష్మీ జంట లేదు.

sudheer-rashmi

సుధీర్, రష్మీ జంటకి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్నదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఢీ హిట్ అవ్వడానికి సుధీర్ ఒక ముఖ్య కారణం. ఇలా ఉండగా, ఈ సీజన్లో మాత్రం సుధీర్ కనిపించడంలేదు. దాంతో, “అసలు షో కి మెయిన్ హైలైట్ అయిన సుధీర్ షోలో కనిపించకపోవడం ఏంటి?” అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

sudheer-rashmi 1

సుధీర్, రష్మీ జంట లేకపోవడంతో ఢీ షో రేటింగ్ పడిపోయింది. మొన్న బార్క్ రేటింగ్స్ చూడగా ఢీ షో కు 3.5 రేటింగ్ మాత్రమే వచ్చింది. అయితే.. ఈ షో లో పెర్ఫార్మన్స్ లకు కొదవలేదు. ఓ రేంజ్ లో డాన్సర్లు పెర్ఫర్మ్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. కానీ, ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం సుధీర్-రష్మీ జోడి లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. దీనితో ఈ ఎఫెక్ట్ రేటింగ్స్ పైనా పడిందని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు.


End of Article

You may also like