కోహ్లీని అవుట్ చేయడానికి “ధోని” వేసిన ప్లాన్ ఇదే…కోహ్లీ ఈజీగా బుట్టలో పడ్డాడు.!

కోహ్లీని అవుట్ చేయడానికి “ధోని” వేసిన ప్లాన్ ఇదే…కోహ్లీ ఈజీగా బుట్టలో పడ్డాడు.!

by Megha Varna

Ads

షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (70: 50 బంతుల్లో 5×4, 3×6), విరాట్ కోహ్లీ (53: 41 బంతుల్లో 6×4, 1×6) హాఫ్ సెంచరీలు చేయడంతో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

Video Advertisement

తర్వాత లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (38: 26 బంతుల్లో 4×4, 1×6), డుప్లెసిస్ (31: 26 బంతుల్లో 2×4, 2×6)తో పాటు అంబటి రాయుడు (32: 22 బంతుల్లో 3×4, 1×6) దూకుడుగా ఆడడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18.1 ఓవర్లలో 157/4 స్కోర్ చేసి విజయం సాధించింది.

ALSO CHECK: “RCB కి దరిద్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందిగా.?” అంటూ… CSK తో మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!

ఇది ఇలా ఉండగా. ఆర్సీబీ ఇచ్చిన స్టార్ట్ కి ఇన్నింగ్స్ ఫినిష్ అవ్వడంకి అస్సలు సంభందం లేదు. ఓపెనర్స్ కోహ్లీ, పడిక్కాల్ ఇద్దరు అర్ధ శతకాలు చేసారు. స్కోర్ 200 దాటుతుంది అని ఫాన్స్ అనుకున్నారు. ఒక దశలో 111/0తో ఉన్న బెంగళూరు చివరికి 156/6తో ఇన్నింగ్స్‌ను ముగించింది. 14 వ ఓవర్ లో బ్రేవో ఓవర్ లో కోహ్లీ అవుట్ అవ్వడంతో మొదటి వికెట్ పడింది.

అయితే దూకుడుగా ఆడుతున్న బెంగళూరును నియంత్రించేందుకు ధోని ప్లాన్ తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే. షార్జా లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటె ముందు భాగస్వామ్యం బ్రేక్ చేయడం ముఖ్యం అని ధోని మ్యాచ్ తర్వాత తెలిపారు. 10 ఓవర్లు తర్వాత స్కోర్ చేయడం కొంచెం స్లో అయ్యింది. దేవదత్ పడికల్ ని నియంత్రించడంలో జడేజా కొంతమేర సఫలమయ్యారు. అదే సమయంలో స్పెల్ ని మొయిన్ అలీకి ఇద్దామనుకున్నారంట ధోని. కానీ చివరి క్షణంలో బ్రేవో కి బాల్ అందించాడు.

ఎందుకంటే బ్రేవో ఒక ఓవర్ లో వేరు వేరుగా బాల్స్ వేయగలడు. సడన్ గా స్లో బాల్స్ కూడా వేస్తూ ఉంటాడు. ఓవర్‌లో ఆరు వేర్వేరు బంతులు వేయమని డ్వేన్ బ్రావోకి చెప్పాను. బంతిని ఇచ్చిన రెండో బంతికే విరాట్ కోహ్లీని బ్రావో ఔట్ చేశాడు అని ధోని మ్యాచ్ తర్వాత తెలిపారు. చిన్న ప్లాన్ నే అమలు చేసాము. ఆ ట్రాప్ లో కోహ్లీ చిక్కాడు అని తెలిపారు.


End of Article

You may also like