Home Filmy Adda మహేష్ సినిమాకి నిర్మాతగా ఆ స్టార్ క్రికెటర్..??

మహేష్ సినిమాకి నిర్మాతగా ఆ స్టార్ క్రికెటర్..??

by Anudeep

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు కి ఇండియా లెవల్ లో కూడా మంచి క్రేజ్ ఉంది..అదేంటి మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చెయ్యకుండా ఇండియా వైడ్ అంత క్రేజ్ ఎలా వచ్చింది అని మీరు అనుకోవచ్చు..సోషల్ మీడియా లో ఈ స్థాయిలో వృద్ధి చెందిన రోజుల్లో ఆయనకీ పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ రావడం లో వింత ఏముంది అని అంటున్నారు విశ్లేషకులు.

 

అయితే ఎంత మంది ట్రై చేసిన మహేష్ తో ఇప్పటివరకు ఒక్క బాలీవుడ్ చిత్రం కూడా తీయలేకపోయారు. ఈ నేపథ్యం లో క్రికెట్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఎంఎస్ ధోని ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే. అలాగే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ధోని కి వ్యాపారాలు కూడా ఉన్నాయి.

dhoni producing fims with south stars like mahesh and vijay..!!
అయితే ధోని సినిమా రంగంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
వందల కోట్ల లాభాలు దక్కే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం ద్వారా ధోనీ మరింత మందికి చేరువ అవ్వాలని భావిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

dhoni producing fims with south stars like mahesh and vijay..!!

అందులో భాగంగానే ధోని హిందీ సినిమాలతో పాటు సౌత్ లో కూడా పలు సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. స్థానిక నిర్మాణ సంస్థలతో కలిసి ధోని సినిమా నిర్మాణం జరుగబోతుంది. ఈ క్రమం లో ఆయన ద్రుష్టి ఎక్కువగా సౌత్ స్టార్స్ మీదనే పెట్టినట్టు తెలుస్తుంది..ధోని సినిమాల నిర్మాణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుతో మొదలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ధోనీ ప్రతినిధులు ఇప్పటికే మహేష్ బాబుతో చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి.

dhoni producing fims with south stars like mahesh and vijay..!!
ఈ సినిమా హిందీ కి సంబంధించిన రైట్స్ మొత్తం ధోని తీసుకోవాలని ఆలోచిస్తున్నాడట. దానితో పాటు మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత చెయ్యబోయే సినిమా కూడా ధోని ప్రొడక్షన్ హౌస్ నుండే ఉంటుందట..ఇది అభిమానులకు పండగ లాంటి వార్తే అని చెప్పొచ్చు.

మరో పక్క ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా ఒక సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తునట్టు సమాచారం..గత కొద్దీ రోజుల క్రితం ధోని చెన్నై లో విజయ్ ని కలిసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆయన అలా కలవడానికి ముఖ్య కారణం ఇదేనట..క్రికెట్ రంగం లో దిగ్గజం గా నిలిచి ఎవ్వరికి సాధ్యపడని అనితర సాధ్యమైన కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన ధోని..సినీ రంగం లో ఎలా రాణిస్తాడో చూడాలి.

dhoni producing fims with south stars like mahesh and vijay..!!

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మహేష్ బాబు చేస్తాడు. ఆ తర్వాత ధోని నిర్మాణంలో మహేష్ బాబు సినిమా ఉండే అవకాశం ఉంది.

You may also like