అన్న సమాధి వద్దే భార్యకు సీమంతం చేసిన ధృవ సర్జా

అన్న సమాధి వద్దే భార్యకు సీమంతం చేసిన ధృవ సర్జా

by Harika

Ads

‘అద్దురి’ సినిమాతో కన్నడ సినీ ఇండ్రస్టీలో అడుగుపెట్టాడు హీరో ధృవ సర్జా. శాండల్‌వుడ్ హీరో ధృవ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు మేనల్లుడు.

Video Advertisement

అలాగే స్వర్గీయ చీరంజీవి సర్జాకి తమ్ముడు కూడా. కన్నడ చిత్ర పరిశ్రమలో ధృవకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

అయితే ఈ ఇటీవల ధృవ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసులు కురిపిస్తున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్న ధృవకు ఒక పాప ఉంది. ఆమె భార్య ప్రేరణ మళ్లీ గర్భవతి. అయితే శ్రీ కృష్ట జన్మాష్టమి రోజు ధృవ తన భార్యకు సీమంత వేడుక నిర్వహించారు. దీనికి ఎందుకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారని అనుకుంటున్నారా.. ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది.

తన అన్నయ్య చీరంజీవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే తన భార్య సీమంత వేడుకను ధృవ ఫామ్‌ హౌస్‌లో చీరంజీవి సర్జా సమాధి దగ్గర జరిపించాడు. ఫామ్ హౌస్‌ మొత్తాన్ని పూలతో అలంకరించాడు కూడా. అలాగే పిల్లలకు కృష్ణుడి వేషం వేసి వేడుకగా జరుపుకున్నారు.

ఈ విషయాన్ని ధృవ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు అన్న మీద నీకు ఉన్న ప్రేమను చాటుకున్నావు. నువ్వు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికీ సర్జా కుటుంబం చీరంజీవి మరణం నుంచి కోల్కోవటలేదు.

 


End of Article

You may also like