“జవాన్” సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ “అనిరుధ్” రెమ్యునరేషన్ ఎంతంటే..?

“జవాన్” సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ “అనిరుధ్” రెమ్యునరేషన్ ఎంతంటే..?

by kavitha

Ads

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకరు. తనకన్నా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లు అయిన యువన్ శంకర్ రాజా, హరీష్ జైరాజ్ వంటివారిని బీట్ చేసి, అనిరుధ్ కోలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. అనిరుధ్ పాటలకు మాత్రమే కాకుండా ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Video Advertisement

బాలీవుడ్ మూవీ జవాన్ కి కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ప్రివ్యూకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీకి అనిరుధ్ అందుకున్న రెమ్యూనరేషన్ గురించిన ఒక వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Anirudh-Ravichander-telugu-addaకోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు చార్ట్ బస్టర్ పాటలను అనిరుధ్ రవిచందర్ అందించారు. పవన్ కళ్యాణ్ నటించిన “అజ్ఞాతవాసి” మూవీతో తెలుగువారికి కూడా పరిచయమయ్యారు. కానీ ఆ మూవీలో పాటలతో పెద్దగా మెప్పించలేకపోయారు. ఆ తరువాత నాని నటించిన “గ్యాంగ్ లీడర్” మూవీతో ఒకే అనిపించాడు. ఇక జెర్సీ మూవీతో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకున్న అనిరుధ్, తాజాగా మూడు పెద్ద సినిమాలకు సైన్ చేశారని తెలుస్తోంది.
అనిరుధ్ ప్రస్తుతం షారుక్ ఖాన్, అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొనే వంటి వారు నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం మూవీ పై అంచనాల కన్నా, ఈ మూవీ కోసం అనిరుధ్ అందుకుంటున్న పారితోషికం పైనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఎందుకంటే జవాన్ మూవీకి అనిరుధ్ రూ.10 కోట్లు రెమ్యూనరేషన్  అందుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది.
భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన ఒక  మూవీకి దాదాపు రూ.8 కోట్లు పారితోషికం అందుకుంటాడు. అయితే ఇప్పుడు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ఆస్కార్ విన్నర్ రెహమాన్ ను కూడా మించిపోయాడు. అనిరుధ్ రెమ్యూనరేషన్ విషయాన్ని బాక్సాఫీస్ వరల్డ్‌వైడ్ రిపోర్ట్ తెలిపింది. అనిరుధ్ జవాన్ తో పాటుగా లియో, జైలర్, ఇండియన్ 2 వంటి చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు.

Also Read: “ఒరిజినల్ అని చెప్పి ఫ్యాన్ మేడ్ పోస్టర్ రిలీజ్ చేశారు ఏంటి..?” అంటూ… ప్రాజెక్ట్-K నుండి “ప్రభాస్” ఫస్ట్‌లుక్‌పై 15 మీమ్స్..!


End of Article

You may also like