Ads
సినిమా వాళ్ళ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సినిమా ప్రియులకు తమ బంధువుల వార్తలు తెలిసిన తెలియకపోయినా సెలబ్రిటీల గురించి మాత్రం ప్రతి చిన్న విషయం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. వాళ్లతో మనకి పరిచయం లేకపోయినా మన వాళ్లే అంత చనువు వస్తుంది. ఇలా చిన్నచిన్న విషయాలకే జనాల్లో చర్చ జరిగితే. పెళ్లి లాంటి పెద్ద విషయాలు తెలిసినప్పుడు డిస్కషన్ మామూలుగా జరగదు.
Video Advertisement
ఇది మాత్రం సినిమా ప్రియులే కాకుండా మామూలు ప్రజలు కూడా చర్చించుకునే విషయం. ఇంతగా పాకుతుంది అని సెలబ్రెటీలు జాగ్రత్తపడి ఆడంబరంగా చేసుకోకపోయినా, మీడియా పుణ్యమా అని వారి జీవితాల్లో జరిగే విషయాలు సామాన్య ప్రజలకు కూడా తెలుస్తూనే ఉంటాయి.
వాస్తవానికి బాలయ్య సినీ కెరీర్ లో ఆయనపై వచ్చిన పుకార్లు చాలా తక్కువ. ఫలానా హీరోయిన్ తో ఎఫైర్ ఉంది అంటూ వచ్చిన వార్తలు కూడా ఏమీ లేవు. అయితే.. ఒక్క మద్రాస్ హీరోయిన్ విషయంలో మాత్రం ఒక వార్త వచ్చింది. తెలుగు లివ్స్ కధనం ప్రకారం.. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు చెప్పిన కొన్ని ఇంటర్వ్యూలలో ఈ విషయం బయటకి వచ్చింది. బాలయ్య ఓ మద్రాస్ హీరోయిన్ ను ప్రేమించాడని.. అయితే ఇది నచ్చని ఎన్టీఆర్ బాలయ్యకు వెంటనే పెళ్లి చేసేయాలని కోరాడని చెప్పుకొచ్చారు.
అప్పుడు కాకినాడకు చెందిన తమ బంధువుల అమ్మాయి అయిన వసుంధరను సంబంధం కుదిర్చి పెళ్లి జరిపించినట్లు చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ రాపాక బాలయ్య సినిమాలకు కాస్ట్యూమ్స్ విభాగంలో పని చేసిన సంగతి తెలిసిందే. అయితే.. షూటింగ్ గ్యాప్స్ లో బాలయ్య చాలా విషయాలు మాట్లాడేవారని.. ఆయనది కిడ్ తరహా మనస్తత్వమని శ్రీ రాపాక చెప్పుకొచ్చింది. శ్రీ రాపాక కూడా బాలయ్య ఓ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించారని, పెళ్లి చేసుకోవాలనుకున్నారని.. కానీ అందుకు తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణ అడ్డు చెప్పారని చెప్పుకొచ్చింది.
అటు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గాని, ఇటు శ్రీ రాపాక గాని ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు. అప్పట్లో తమిళనాడు పేపర్లలో వచ్చిన వార్తల ప్రకారం అప్పటికే కొత్తగా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీకి వచ్చిన ఖుష్బూను బాలయ్య ఇష్టపడి ఉంటారని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలైతే కుటుంబాన్ని సరిగ్గా గౌరవించరని భావించిన ఎన్టీఆర్ సాంప్రదాయ కుటుంబానికి చెందిన వసుంధరను ఇచ్చి బాలయ్యకు పెళ్లి చేసారు.
End of Article