“బేబీ” సినిమా క్లైమాక్స్‌లో విరాజ్ నటించిన సన్నివేశాన్ని కట్ చేశారా..?

“బేబీ” సినిమా క్లైమాక్స్‌లో విరాజ్ నటించిన సన్నివేశాన్ని కట్ చేశారా..?

by kavitha

Ads

ఒక మూవీ కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో వసూళ్లు రాబడతాయో ‘బేబీ’ మూవీ నిరూపించింది. నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ఈ మూవీ రెండవ వారం కూడా ఊహించని స్థాయిలో వసూళ్లను సాధిస్తోంది.

Video Advertisement

చిన్న మూవీగా రిలీజ్ అయిన ‘బేబి’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో పాటుగా కీలక పాత్రలో విరాజ్ అశ్విన్ నటించారు. బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలుగు రాష్ట్రాలలో జోరుగా వర్షాలు పడుతున్నప్పటికీ బేబీ మూవీ థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ యాబై కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో హీరోగా అనంద్‌తో పాటు విరాజ్ అశ్విన్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల నటన పై  ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ‘బేబి’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ ఫిదా అవుతున్నారు.
baby movie reviewఈ మూవీలో నటించిన యాక్టర్స్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ వంటి సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేష్ ఒక ఇంటర్వ్యూలో తాజాగా సినిమాకి సంబంధించిన పలు విషయాలను తెలిపారు. సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తారు.హీరో ఆనంద్ హీరోయిన్ గురించిన ఆలోచనలతో తాగుతూ అలాగే ఉండిపోయినట్లు దర్శకుడు చూపించాడు. కానీ రెండవ హీరోగా నటించిన విరాజ్‌ను చూపించలేదు. ఆ విషయం గూర్చి అడుగగా, ‘క్లైమాక్స్‌లో విరాజ్‌ సన్నివేశాన్ని  తీశాం. కానీ నిడివి పరంగా ఆ సీన్ ను తొలగించాల్సి వచ్చింది’ అని తెలిపారు. ఆ విధంగా చాలా సన్నివేశాలు కట్ చేశామని, వాటిని ఓటీటీలో చూపిస్తామని వెల్లడించారు.

Also Read: “అణుబాంబు” తయారుచేసిన సైంటిస్ట్ కి భగవద్గీతతో ఉన్న సంబంధం ఏంటి..? అసలు ఈ వివాదం ఏంటి..?


End of Article

You may also like