Ads
దర్శకులలో సుకుమార్ ది ప్రత్యేక శైలి అని కొత్తగా చెప్పక్కర్లేదు. సినిమా కి తగ్గట్లు సున్నితమైన ఎమోషన్స్ ను పండించగలగడం లో సుకుమార్ దిట్ట. తన ప్రతి సినిమాలోనూ తనదైన మార్క్ ని ప్రత్యేకం గా చూపిస్తూ ఉంటాడు. ప్రతి సినిమాలో క్యారెక్టర్ లను ఎంత పధ్ధతి గా చెక్కుతాడో, చుట్టూ ఉండే పరిసరాలను అందుకు తగ్గట్లు చూపించడం లో కూడా సుకుమార్ శ్రద్ధ తీసుకుందాం. ఉదాహరణగా, రంగస్థలం లోని ఓ సన్నివేశం గురించి తెలుసుకుందాం.
Video Advertisement
“రంగస్థలం” సినిమా లో చిట్టిబాబు కి అన్నగా నటించిన కుమార్ బాబు ని హత్య చేస్తారు కదా.. ఆ సీన్ లో చిట్టిబాబు కుమార్ బాబు ని తన భుజం పై ఎక్కించుకుని నడుచుకుంటూ వస్తాడు. ఆ సీన్ లో ఓ పక్కాగా మీరూ జాగ్రత్తగా గమనిస్తే..మీకు ఓ గోడ పై కుమార్ బాబు పోస్టర్ కనిపిస్తుంది. లాంతరు గుర్తుకే మీ ఓటు అంటూ కుమార్ బాబు ఫోటో ఉన్న పోస్టర్ ను ఓ చిన్న పిల్లాడు అంటిస్తూ ఉంటాడు.
చిట్టిబాబు..కుమార్ బాబు శవాన్ని భుజం పై మోసుకొస్తూ ఉండగా.. ఈ పోస్టర్ కూడా కిందకి జారిపోతూ ఉంటుంది. అంటే కుమార్ బాబు నెలకొరిగాడని, ఇక ప్రాణాలతో లేదని అర్ధం వచ్చేలా సింబాలిక్ గా చూపించడానికి దర్శకుడు సుకుమార్ ఇలా చూపిస్తాడు. ఇది ఎంతో సున్నితమైన విషయం. దానిని కూడా కథ కి అనుగుణం గా ఎంతో హృద్యం గా చూపించాడు సుకుమార్.
End of Article