Ads
ఎట్టకేలకి రామ్ చరణ్ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ బయటకి వచ్చింది. రేపు రామ్ చరణ్ తన పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి. మరొక పక్క రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొన్ని సినిమాల ప్రకటనలు, పోస్టర్లు రాబోతున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా బృందం కూడా ఒక అప్ డేట్ ఇచ్చారు.
Video Advertisement
ఈ సినిమా నుండి జరగండి అనే పాట రేపు విడుదల అవుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటని రేపు 9 గంటలకి విడుదల చేస్తున్నారు. ఈ న్యూస్ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ పాట గత సంవత్సరం విడుదల చేయకముందే బయటికి వచ్చింది. కానీ అది కేవలం ట్రాక్ వెర్షన్ అని, సినిమాలో పాట వేరేగా ఉంటుంది అని అన్నారు. క్రిస్టమస్ సందర్భంగా ఈ సినిమా పాట విడుదల అవుతుంది అని అన్నారు. కానీ అప్పుడు కూడా విడుదల అవ్వలేదు. ఇప్పుడు రామ్ చరణ్ పుట్టినరోజుకి ఈ పాటని విడుదల చేస్తున్నారు. దిల్ రాజు గారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. జరగండి పోస్టర్ చాలా రోజుల క్రితం విడుదల చేశారు. రామ్ చరణ్ ని వెనుక నుండి ఫోటో తీసిన ఈ పోస్టర్ కి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ అదే గెటప్ లో ఉన్న పోస్టర్ విడుదల చేశారు. కానీ ఇందులో రామ్ చరణ్ లుక్ రివీల్ చేశారు. చాలా డిఫరెంట్ గా రామ్ చరణ్ కనిపిస్తున్నారు. అయితే, ఈ పోస్టర్ లో కొన్ని విషయాలని చాలా మంది గమనించారు. అందులో ఒకటి రామ్ చరణ్ చేతిలో ఉన్న పుస్తకం. అది ఏదో మామూలు పుస్తకం అనుకుంటే పొరపాటు చేసినట్టే. ఆ పుస్తకానికి ఒక చరిత్ర ఉంది.
ఆ పుస్తకం రాసిన వ్యక్తి చాలా గొప్పవారు. ఆ పుస్తకం పేరు ప్రేమ కథలు. ఆ పుస్తకాన్ని చలం గారు రాశారు. తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన వారిలో చలం గారు ఒకరు. ఆ కాలంలో మాట్లాడుకోవడానికి, అసలు సాధారణ ఇళ్ళల్లో వినడానికి కూడా ఇబ్బంది పడే ఎన్నో విషయాల మీద చలం గారు తన పుస్తకాల రూపంలో తన అభిప్రాయాలని వ్యక్తపరిచారు. సమాజాన్ని మార్చడం కోసం తన వంతు కృషి చేశారు. చలం గారు రాసిన పుస్తకాల్లో ప్రేమ కథలు అనే పుస్తకం కూడా ఒకటి. సాధారణంగా ప్రేమ అంటే ఏదో కవిత్వం, లేదా రోమియో జూలియట్ లాంటి వారి రిఫరెన్స్ లు ఉంటాయి.
కానీ చలం గారు రాసిన పుస్తకం రిఫరెన్స్ ఉండడం మాత్రం చాలా అరుదుగా జరిగింది. మరి సినిమాలో హీరో పాత్రని వివరిస్తూ ఇలాంటి ఒక రిఫరెన్స్ పెట్టారు ఏమో. ఎందుకంటే ఈ సినిమాలో హీరో ఒక ఐఏఎస్ ఆఫీసర్. సమాజం బాగు కోసం కష్టపడతారు. కాబట్టి ఆ పాత్ర ఇలాంటి పుస్తకాలు చదువుతారు కాబట్టి ఈ పుస్తకం పెట్టారు ఏమో. కానీ ఏదేమైనా, ఇలాంటి రిఫరెన్స్ ఉండడం, అది కూడా ఒక కమర్షియల్ సినిమాలో, ఒక మాస్ డ్యూయెట్ పాటలో ఇలాంటి పుస్తకం చూపించడం అనేది ఇది మొదటిసారి జరిగింది అని అంటున్నారు.
ALSO READ : ఈ ఫోటోలో ఒక పొలిటీషియన్, ఒక యాక్టర్ ఉన్నారు..! ఎవరో కనిపెట్టగలరా..?
End of Article