అప్పట్లో కూడా ఇంత చెత్త సినిమాలు ఉన్నాయా..? ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా గురించి తెలుసా..?

అప్పట్లో కూడా ఇంత చెత్త సినిమాలు ఉన్నాయా..? ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా గురించి తెలుసా..?

by kavitha

Ads

నట సార్వ భౌమ నందమూరి తారక రామారావుగారు సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, అంచెలంచెలుగా ఎదిగి తెలుగులో స్టార్ హీరోగా మారారు. ఆయన జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటించి మహానటుడుగా ఎదిగారు.

Video Advertisement

సినీ రంగంలోనే కాకుండా ఆయన రాజకీయాలలో రాణించారు. ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాముడు కృష్ణుడు పేరు చెబితే తెలుగు వారికి కనిపించేది ఆ రూపంలోని ఎన్టీఆర్. ఎన్నో అద్భుత చిత్రాలలో నటించారు. అన్ని రకాల పాత్రలలో నటించారు. ఆయన నటించిన సినిమాలలో సూపర్ మెన్ కూడా ఒకటి. ఆ చిత్రం గురించి ఇప్పుడు చూద్దాం..
Super-Manతెలుగు సిని పరిశ్రమలో లెజెండరీ నటుడిగా వెలుగోందారు సీనియర్ ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉండడటంలో ఆయన పాత్ర ఎంతగానో ఉంది. అలాంటి ఎన్టీఆర్ సినిమాలలో చేయని పాత్ర అంటూ లేదు. తన చిత్రాలతో తెలుగువారిని అలరించారు. సూపర్ హీరోల సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. కానీ సీనియర్ ఎన్టీఆర్ 1980 లోనే ఆ తరహా చిత్రంలో నటించారు. ఈ సినిమా గురించి ఇప్పటివారికి అంతగా తెలియక పోవచ్చు.
సూపర్ మెన్ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్, జయప్రద హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి వి.మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. 1980 లో వచ్చిన సూపర్ మేన్  సినిమాను ఆర్. గోపాల్ నిర్మించాడు.  చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఫిక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో జయమాలిని, కైకాల సత్యనారాయణ, పండరి బాయి ముఖ్యపాత్రలలో నటించారు. తన కుటుంబాన్ని హత్యమార్చిన వారిని వెతికి పట్టుకోవాలనుకునే అబ్బాయి. అంజనేయస్వామిని ప్రార్ధిస్తాడు. ఆంజనేయుడి ఆశీర్వాదాలతో, అతడు అతీంద్రియ శక్తులను పొంది  సూపర్ మేన్ గా మారుతాడు. అయితే అప్పటిదాకా ఎన్నో అద్భుత పాత్రలను పోషించిన ఎన్టీఆర్ కి ఆపాత్ర అంతగా నప్పలేదని, వయసురీత్యా ఆయన సూపర్ మేన్ గా సెట్ అవలేదని టాక్. ఇప్పటివారికి ఆ మూవీని చూసినప్పుడు అలానే అనిపించవచ్చు. ఈ సినిమాలోని పాటలు ఆకట్టుకున్నాయి.

Also Read: చిరంజీవి “బిగ్ బాస్” నుండి… మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” వరకు… ఈ 12 హీరోల “ఫ్లాప్ సినిమాలు” రీ-రిలీజ్ చేస్తే..?


End of Article

You may also like