జూనియర్ ఎన్టీఆర్ కార్ నెంబర్ వెనకున్న ఈ సీక్రెట్ తెలుసా.? 17 లక్షలు ఖర్చు పెట్టింది అందుకే.!

జూనియర్ ఎన్టీఆర్ కార్ నెంబర్ వెనకున్న ఈ సీక్రెట్ తెలుసా.? 17 లక్షలు ఖర్చు పెట్టింది అందుకే.!

by Anudeep

జూనియర్ ఎన్టీఆర్ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఈ మధ్య కార్లు మారుస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవలే లాంబోర్గిని ఉరుస్ మోడల్ ను కొనుగోలు చేసారు. నాలుగు కోట్లు ఖర్చు చేసి ఈ కార్ ను కొన్న ఎన్టీఆర్… నెంబర్ ప్లేట్ కోసం మరో పదిహేడు లక్షలను ఖర్చు చేసారు. ఆ డబ్బు తో మరో కార్ కొనుక్కొచ్చు కదా సార్ అంటూ సోషల్ మీడియా లో మీమ్స్ కూడా ట్రెండ్ అయ్యాయి.

Video Advertisement

junior ntr 3

గతం లో ఇలా చిరంజీవి, శ్రీకాంత్ ఎక్కువ గా కార్లు మారుస్తూ వార్తల్లో నిలిచేవారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అలా వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకు ఆయన ఆ నెంబర్ ప్లేట్ కోసం ఎందుకు పదిహేడు లక్షలు ఖర్చు పెట్టారో చూద్దాం. ఆ నెంబర్ ప్లేట్ లో నాలుగు 9 సంఖ్యలు ఉన్నాయి. గతం లో ఎన్టీఆర్ వాడిన కార్లకు కూడా ఇదే నెంబర్ ప్లేట్ ఉండడం గమనార్హం. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది.

junior ntr 1

ఓ సందర్భం లో ఎన్టీఆర్ ఈ విషయాన్నీ వెల్లడించారు కూడా. ఎన్టీఆర్ కు “9 ” అనే నెంబర్ లక్కీ నెంబర్. అంతే కాదు.. సీనియర్ ఎన్టీఆర్ కూడా తన కార్ నెంబర్ 9999 ఉండేలా చూసుకునేవారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా అలాంటి నెంబర్ ప్లేట్ ఉన్న కార్ నే వాడేవారు. ఇదే సెంటిమెంట్ ను జూనియర్ ఎన్టీఆర్ కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు.

junior ntr 2

ఈ 9999 నెంబర్ ప్లేట్ ను వేలంపాట లో కొనడానికి ఎన్టీఆర్ లక్షలు ఖర్చు చేయడానికి కూడా వెనకాడడం లేదు. మరో విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ లో కూడా 9999 అనే నెంబర్ ను వినియోగిస్తుండడం గమనార్హం.

సెలెబ్రిటీలు అయినా, కామన్ మాన్స్ అయినా ఒక సెంటిమెంట్ ను ఫీల్ అయితే.. దానిని కొనసాగిస్తూనే ఉంటారు అనడానికి ఇదే నిదర్శనం.


You may also like