బాలయ్య “భగవంత్ కేసరి” పోస్టర్ లో ఇవి గమనించారా..?

బాలయ్య “భగవంత్ కేసరి” పోస్టర్ లో ఇవి గమనించారా..?

by kavitha

Ads

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యంగ్ హీరోయిన్ శ్రీలీల ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తోంది.

Video Advertisement

ఈ సినిమా చిత్రీకరణ కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రం పై అంచనాలు పెరుగుతున్నాయి. జూన్ 10న బాలయ్య  పుట్టినరోజు సందర్భంగా 2 రోజుల ముందే టైటిల్ రీవిల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో ఉన్న కొన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం..
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబో ప్రకటించినప్పటి నుండే ఈ చిత్రం పై అందరి దృష్టి పడింది. మాస్ హీరోని అనిల్ రావిపూడి ఎలా చూపిస్తారో చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో చిత్రం పై అంచనాలను ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సినిమా టైటిల్ గురించి కామెంట్స్  వినిపిస్తున్నాయి. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా 2 రోజుల ముందుగానే మూవీ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాకి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ఫైనల్ చేసి, పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ కు ‘ఐ డోంట్ కేర్’ అనే ఉపశీర్షికను ఇచ్చారు. భగవంత్ అనగా విష్ణుమూర్తి, కేసరి అనగా సింహం’ అని అర్ధం. బాలకృష్ణకి టైటిల్ లో సింహం అని పెట్టుకునే సెంటిమెంట్ ఉంది.  అందువల్లే  ‘భగవంత్ కేసరి’ అని పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ పోస్టర్ లో బాలకృష్ణ చేతిలో డీఫెరెంట్ వెపన్ పట్టుకొని ఉన్నారు. అలాగే టైటిల్ లో భగవంత్ పదంలో మూడు సింహాల గుర్తు ఉంది. అంటే ఈ మూవీ కథ చట్టం, పోలీసుల చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. పోస్టర్ లో బాలయ్య మాస్ గా కనిపిస్తూనే స్టైలిష్ గా కూడా ఉన్నారు.

Also Read: విజయ్ నెక్స్ట్ సినిమాలో విలన్ ఆ హీరోనా..? ఇన్ డైరెక్ట్ గా ఇంత పెద్ద క్లూ ఇచ్చేశారుగా..?

 


End of Article

You may also like