విజయ్ నెక్స్ట్ సినిమాలో విలన్ ఆ హీరోనా..? ఇన్ డైరెక్ట్ గా ఇంత పెద్ద క్లూ ఇచ్చేశారుగా..?

విజయ్ నెక్స్ట్ సినిమాలో విలన్ ఆ హీరోనా..? ఇన్ డైరెక్ట్ గా ఇంత పెద్ద క్లూ ఇచ్చేశారుగా..?

by kavitha

Ads

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా తనకంటూ ప్రత్యక ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తమిళంలోనే కాకుండా విజయ్ కు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు.

Video Advertisement

విజయ్ దళపతి ప్రస్తుతం సంచలన దర్శకుడు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో లియో అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం సెట్స్ పై ఉంది. ఇటీవల ‘తలపతి 68’ చిత్రాన్ని ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలోసినిమాలో నటించే  విలన్ గురించి క్లూ ఇచ్చారు. మరి విలన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
thalapathy-68-1విజయ్ దళపతి కొత్త సినిమాల కోసం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. ఏడాది మొదట్లోనే వారసుడు మూవీతో దక్షిణాది ఆడియెన్స్ అలరించిన విజయ్, ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నారు. విక్రమ్ దర్శకుడు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. హిట్ పెయిర్ గా పాపులర్ అయిన ఈ జంట 17 ఏళ్ల తర్వాత మరోసారి జత కడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ లియో చిత్రం పై హైప్ ను పెంచింది.
విజయ్ ఒక వైపు లియో మూవీ షూటింగ్ లో పాల్గోంటూనే, మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘తలపతి 68’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాని ప్రకటిస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్నాడు. ఈ వీడియోలో మూవీకి సంబంధించిన విషయాలను పజిల్స్ తో చూపించారు.

అందులో విలన్ ఎవరో క్లూ ఇచ్చారు. ఒక ట్విట్టర్ ఖాతాలో ఆ పజిల్ క్లిపింగ్ ను ఇచ్చి, విలన్ ఎవరో గెస్ చేయమని అంటే ఎక్కువగా ఎస్ జే ఎస్  అక్షరాలకు రౌండప్ చేసి ఎస్ జే సూర్య ఈమూవీలో విలన్ అని కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ మరియు ఎస్ జే సూర్య ఇంతకు ముందు కూడా నటించారు.

 

Also Read: హీరోయిన్ శ్రీలీల “చైల్డ్ ఆర్టిస్ట్” గా నటించారా..? ఏ సినిమాలో అంటే..?


End of Article

You may also like