సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఒక సంవత్సరం చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా నటులు అయితే ఎంతో మంది వస్తూ ఉంటారు. కొంత మంది కొన్ని సినిమాలు చేసి ఆపేస్తే, మరి కొంత మంది మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటారు.

Video Advertisement

వీరిలో కొంత మంది అయితే మొదటి సినిమాతోనే చాలా క్రేజ్ సంపాదించుకొని, ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉంటారు. అలా మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని, ఇప్పుడు బిజీగా ఉన్న నటి శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత ధమాకా సినిమాతో హిట్ కొట్టారు.

movie in which sreeleela acted as child artist

ఇప్పుడు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో, అలాగే రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో, బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ తో ఒక సినిమా, నితిన్ తో ఒక సినిమాలో కూడా నటిస్తున్నారు.

movie in which sreeleela acted as child artist

తన ఎక్స్ప్రెషన్స్ తో, డాన్స్ తో శ్రీలీల చాలా క్రేజ్ సంపాదించుకున్నారు. శ్రీలీల తన కెరీర్ ని కన్నడ సినిమాతో మొదలు పెట్టారు. అయితే అంతకుముందే శ్రీలీల ఒక సినిమాలో బాలనటిగా నటించారు. అది కూడా ఒక తెలుగు సినిమాలో శ్రీ లీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ సినిమానే చిత్రాంగద. కొన్ని సంవత్సరాల క్రితం అంజలి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల ఒక చిన్న పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సీన్స్ లో శ్రీలీల కనిపిస్తారు.

movie in which sreeleela acted as child artist

హీరోయిన్ సింధూ తులాని ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. సింధూ తులాని చిన్నప్పటి పాత్రలో శ్రీలీల నటించారు. ఈ సినిమాకి భాగమతి సినిమాకి దర్శకత్వం వహించిన అశోక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎండ్ క్రెడిట్ సీన్స్ లో కూడా శ్రీలీల పేరు బేబీ లీలా అని వేస్తారు. అలా శ్రీలీల చాలా సంవత్సరాల క్రితమే తెలుగు సినిమాలో నటించారు. ఇంక శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ALSO READ : అలనాటి “విజయ నిర్మల” నుండి… నేటి “నందిని రెడ్డి” వరకు… తెలుగు ఇండస్ట్రీలో సత్తా చాటిన 15 “మహిళా డైరెక్టర్లు” వీరే..!