Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కొన్నేళ్లుగా మహేష్ మెసేజ్ తో కూడిన క్లాస్ సినిమాలను చేస్తూ వచ్చారు. గుంటూరు కారం మూవీతో సూపర్ స్టార్ మాస్ అవతార్ లో ప్రేక్షకులను అలరించనున్నారు.
Video Advertisement
రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా చాలా రోజుల తరువాత మాస్ లుక్ లో, తన డైలాగ్స్ యాక్షన్ తో అలరించారు. అయితే ఈ ట్రైలర్ లో కనిపించిన కొన్ని విషయాల పై నెట్టింట్లో చర్చ జరుగుతోంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అతడు, ఖలేజా లాంటి క్రేజీ చిత్రాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం మూవీ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్, మూడు పాటలు, పోస్టర్ లు రిలీజ్ అయ్యాయి.
ఆదివారం నాడు సుదర్శన్ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య గుంటూరు కారం ట్రైలర్ విడుదల చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే యూట్యూబ్ లోనూ విడుదల అయ్యింది. రెండు నిమిషాల, 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మహేష్ పాత్రను, బాడీ లాంగ్వేజ్ హైలెట్ అయ్యే విధంగా చూపించారు. మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫిదా చేశాడు. మహేష్ డైలాగ్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్లు శ్రీలీల , మీనాక్షిల గ్లామర్ సైతం ఆకట్టుకుంది. ట్రైలర్ ప్రారంభంలో ప్రెస్ మీట్ లో రమ్యకృష్ణను ఒక జర్నలిస్ట్ ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కనిపించింది.
అతని వాయిస్ త్రివిక్రమ్ వాయిస్ లా ఉంది. దాంతో ఈ మూవీలో త్రివిక్రమ్ కనిపించే ఛాన్స్ ఉందమో అని టాక్. అంతే కాకుండా మహేష్ పాత్ర చిన్నప్పుడు నిప్పు రవ్వ కంట్లో పడినట్టుగా కనిపించింది. ఒకవేళ మహేష్ కంటికి సమస్య ఏదైనా ఉందన్నట్టుగా చూపిస్తారేమో, రెండు సీన్స్ లో మహేష్ కన్ను ఒకటి మూసి చూడడం కనిపించింది. ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ ఫైట్ సీన్ లో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్న ఫీల్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అంటూ ఇప్పటికే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మూవీలో సర్ ప్రైజ్ ఎంట్రీ ఉంటుందా అంటూ చర్చ జరుగుతోంది.
watch video:
Also Read: GUNTUR KAARAM DIALOGUES IN TELUGU, గుంటూరు కారం సినిమా డైలాగ్స్
End of Article