“భద్ర” సినిమాలో ఈ రెండు సీన్లు ఎప్పుడైనా గమనించారా.? భలే మోసం చేసారుగా.?

“భద్ర” సినిమాలో ఈ రెండు సీన్లు ఎప్పుడైనా గమనించారా.? భలే మోసం చేసారుగా.?

by Mohana Priya

Ads

డైరెక్టర్ పని అంత సులభమైనది కాదు. ఒక సినిమా మాత్రమే కాదు ఆ సినిమా లో నటించిన వాళ్ళు, ఇంకా సినిమాకి పని చేసిన వాళ్ళ అందరి బాధ్యత డైరెక్టర్ మీద ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ ని ఎంత పొగుడుతారో, అదే సినిమా ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్ ని అంతే ట్రోల్ కూడా చేస్తారు. అందుకే చాలా మంది డైరెక్టర్లు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా కాకుండా ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్టు సినిమాలు తీస్తున్నారు. మనందరం చెప్పే హిట్ లేదా ఫ్లాప్ అనే రెండు మాటల మీద ఆ డైరెక్టర్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

Video Advertisement

 

అందుకే సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ కి చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిలో కొంతమంది డైరెక్టర్లు చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతారు. ప్రస్తుతానికి దానికి ఉదాహరణగా  భద్ర సినిమా లోని ఈ సీన్ ని చూద్దాం. ఇప్పుడు చెప్పబోయేది కేవలం స్క్రీన్ పై కనిపించిన సీన్ల ఆధారంగా చెప్పేవి మాత్రమే.

ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ దగ్గరికి వాళ్ల ఊరికి చెందిన కొంతమంది యువకులు వస్తారు. విలన్ ని చంపేస్తామని, ప్రకాష్ రాజ్ కి ఏమైనా అయితే ఊరుకోము అని చెప్తారు. ప్రకాష్ రాజ్ వాళ్లని గొడవల్లో పడొద్దు అని జాతర చూడడానికి వచ్చిన వాళ్ళు జాతర చూసి వెళ్ళిపొమ్మని చెప్తారు.

అప్పుడు ఆ యువకులు ప్రకాష్ రాజ్ కి ఏమైనా అయితే వాళ్ళు విలన్ ని వదిలిపెట్టము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ తర్వాత జాతరలో ఫైటింగ్ జరుగుతున్నప్పుడు అంతకు ముందు ప్రకాష్ రాజ్ దగ్గరికి వచ్చిన యువకుల్లో ఒక్కరు కూడా కనిపించరు. ఒకవేళ ప్రకాష్ రాజ్ కి ఏమైనా అయితే విలన్ ని విడిచిపెట్టము అని చెబుతారు. కానీ తర్వాత విలన్ కూడా బతికే ఉంటాడు.

ఇలాంటి వాటిని పూర్తిగా తప్పు అని చెప్పలేం. అలా అని పూర్తిగా కరెక్ట్ అని కూడా చెప్పలేం. ప్రతి సీన్ వెనకాల ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇప్పుడు మిస్టేక్ అనిపించేది ఒకవేళ అందులో కరెక్ట్ అయి ఉండొచ్చు ఏమో అని అనిపిస్తుంది. అందుకే వీటిని లాజిక్ కిందకి కన్సిడర్ చేయడమే కరెక్ట్.

ఇంకా డైరెక్టర్ కష్టం గురించి తెలుసు కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిని పెద్దగా, కాదు కాదు అస్సలు పట్టించుకోరు. ఇలాంటి వాటి మీద సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయం కూడా ఆధారపడి ఉండదు. ఎప్పుడైనా సినిమా చూస్తున్నప్పుడు, ఏదైనా మనకి చూపించిన దాని ప్రకారం ఉండనప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అంతే.


End of Article

You may also like