మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఎప్పుడు లేనంత స్పీడ్ గా వరుస సినిమాలు ప్రకటిస్తూ మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాడు.. మరో వైపు వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజతో తెరపంచుకోనుండటం ఆసక్తికరంగా మారింది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్నఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

Video Advertisement

 

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ టీజర్‌ నెట్టింట్లో హల్‌ చల్ చేస్తోంది. చిరంజీవి మాస్‌ అవతార్‌లో అందరినీ ఎంటర్‌టైన్‌ చేయనున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు డైరెక్టర్‌. అయితే ఈ చిత్రం నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసారు.

did you notice this in sri devi chiranjeevi song..??

ఈ కలర్ఫుల్ రొమాంటిక్ డ్యూయెట్ లో చిరంజీవి, శృతి హాసన్ లుక్స్ బావున్నాయి. ఫ్రాన్స్ లో దట్టమైన మంచులో ఈ సాంగ్ ని షూట్ చేసారు. విజువల్స్ బావున్నాయి. ఈ సాంగ్ కి కూడా దేవి శ్రీ ప్రసాద్ నే లిరిక్స్ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు వాల్తేరు వీరయ్య టైటిల్ చూసిన వాళ్లంతా చిరు ప‌క్కా మాస్ అవ‌తార‌మే ఇది అనుకున్న వాళ్ల‌కు ఈ సాంగ్ వ‌చ్చాక ఇందులో క్లాస్ లుక్ కూడా ఉంటుంద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.

did you notice this in sri devi chiranjeevi song..??

అయితే ఈ సాంగ్ లో చిరు లుక్స్, స్టెప్స్ బావున్నాయి కానీ లిరిక్స్, ట్యూన్ అంత బాగోలేవు. ఇంతకు ముందు వచ్చిన ‘ బాస్ పార్టీ’ సాంగ్ లో కూడా లిరిక్స్ ట్యూన్ బాగోలేదన్న విమర్శలు వచ్చాయి. ‘శ్రీ దేవి చిరంజీవి’ సాంగ్ ట్యూన్, లిరిక్స్ కాపీ అని అంటున్నారు నెటిజన్లు. ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలోని ‘ సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో..సుందరి’ పాట స్టైల్లో ఉంద‌ని అంటున్నారు. దేవీ ఇక మార‌డ్రా బాబోయ్ అంటున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దానికి సంబంధించిన ఒక వీడియో ని నెట్టింట వైరల్ చేస్తున్నారు ప్రేక్షకులు.

 

watch video: