“గంగోత్రి” మూవీలో ఈ పొరపాటు గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

“గంగోత్రి” మూవీలో ఈ పొరపాటు గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?

by kavitha

Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ గా మంచి క్రేజ్ ను  సొంతం చేసుకున్నారు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. ప్రస్తుతం ఆయనకు నార్త్ లో కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు.

Video Advertisement

అల్లు అర్జున్ హీరోగా నటించిన తొలి చిత్రం గంగోత్రి. ఈ సినిమాకి కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరోయిన్ గా ఆదితి అగర్వాల్ నటించారు. తాజాగా ఈ చిత్రంలోని వల్లంకి పిట్ట పాటను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఈ వీడియోకి నెటిజెన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
gangotriగంగోత్రి మూవీ రిలీజ్ అయ్యి, 20 ఏళ్లు అవుతోంది. ఈ చిత్రం ద్వారా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు ఆదితి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. తొలి మూవీ హిట్ అవడంతో ఇద్దరు ఈ మూవీ తరువాత ఆఫర్స్ ను అందుకున్నారు. కానీ అల్లు అర్జున్ వరుస సినిమాలు చేస్తూ, అవి హిట్ అవడంతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. గంగోత్రి సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 101 వ మూవీ కావడం విశేషం.

కీరవాణి అందించిన మ్యూజిక్, పాటలు కూడా  సూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలోని ఒక మిస్టేక్ ను గమనించి, దానిని మీకు మాత్రమే చెప్తా అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేశారు. ఆ వీడియోకి తేజ బాబు పేరుగలేదేంటి తాతా అని పెట్టారు. ఆ వీడియో ఏమిటంటే వల్లంకి పిట్ట పాట. ఆ పాట మొదట్లో హీరోయిన్ చిన్నపాపగా ఉంటుంది. ఆ తరువాత కొంచెం పెద్దగా అవుతుంది. కానీ తేజ మాత్రం అలానే ఉంటాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ తప్పు ఎలా చేసారని కొందరు అంటున్నారు.

https://www.instagram.com/reel/Cs51DfBL5GT/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: ఒక ప్రమాదకరమైన ప్రకటన 3 గంటల సినిమా అయితే..? ఈ సినిమా చూశారా..?


End of Article

You may also like