Ads
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ హీరో నటించిన తమిళ చిత్రాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం ద్వారా శివకార్తికేయన్ తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు.
Video Advertisement
రేమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో కూడా విజయం సాధించాడు. గత నెల 14న శివకార్తికేయన్ నటించిన మహావీరుడు మూవీ రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ మూవీ చూసిన నెటిజెన్లు ఈ చిత్రంలోని పొరపాటును గమనించి సోహల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. తమిళ హీరో శివకార్తికేయన్ కు టాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ అనే తెలుగు సినిమాను చేశాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానీ శివకార్తికేయన్ ముందు సినిమాల కన్నా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇటీవల శివకార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యింది.
ఈ మూవీ మొదటి షోతోనే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మూవీ కాన్సెప్ట్ బాగున్నా, ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా ఉందనే టాక్ వచ్చింది. శివకార్తికేయన్ మార్క్ కామెడితో రూపొందింది. అయితే ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ మధ్య ఓటీటీలో సినిమాలు చూస్తూ, అందులో ఉండే పొరపాట్లను గమనించి, మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం, అవి కాస్త వైరల్ అవడం సాధారణం అయిపోయింది.
ఓటీటీలో ఈ మూవీని చూసి, ఇందులోని ఒక పొరపాటును గమనంచిన ఒక నెటిజెన్, హర్ష్ మీమర్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో దానికి సంబంధించిన వీడియోకి ‘ఎడిటింగ్ చూసుకోవాలి కదా’ అంటూ షేర్ చేశాడు. ఆ వీడియోలో బోర్డు పై ముందు తమిళంలో మా భూమి అని, వెంటనే తెలుగులోకి మారుతుంది. దీనిపై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/Cv6kfoEJK1c/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: “స్వర్ణ కమలం” సినిమాలో ఈ 2 సీన్స్ గమనించారా..? ఇందులో ఇంత అర్ధం ఉందా..?
End of Article