“అఖండ” క్లైమాక్స్ ఫైట్ లో ఇది గమనించారా.? మన సంస్కృతికి బాలయ్య – బోయపాటి ఇచ్చిన గౌరవంకి హ్యాట్సాఫ్.!

“అఖండ” క్లైమాక్స్ ఫైట్ లో ఇది గమనించారా.? మన సంస్కృతికి బాలయ్య – బోయపాటి ఇచ్చిన గౌరవంకి హ్యాట్సాఫ్.!

by Anudeep

Ads

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

Video Advertisement

ఈ సినిమా లో బాలయ్య లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బాలయ్య లీడ్ రోల్ చేస్తున్న ఏ సినిమా అయినా వన్ మాన్ షో అయిపోతుంది. అఖండ విషయంలో కూడా అదే నిజమైంది.

akhanda 1

అయితే.. ఈ సినిమా అందరికి నచ్చడానికి మరొక కారణం ఏంటంటే అందులో ఉన్న సున్నితమైన ఎలిమెంట్స్. చిన్న చిన్న అంశాలు కూడా సినిమాకి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శివుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమా వేరే లెవెల్ లో నడుస్తూ ఉంటుంది.

akhanda 2

ఒక సీన్ లో విలన్ ని పిచ్చ కొట్టుడు కొట్టిన బాలకృష్ణ.. తిరిగి వెళ్ళిపోతూ ఒక నిమిషం ఆగిపోతాడు. కాలికింద చీమ వెళ్తూ ఉండడం చూసి.. ఆ చీమ వెళ్లేవరకూ ఆగి ఆ తరువాత వెళ్తాడు. అంటే చేయని తప్పుకి ఎవరిని శిక్షించకూడదు అన్న ఉద్దేశ్యంలో “దుష్ట శిక్షణ..శిష్ట రక్షణ” అన్న సూత్రాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.

akhanda 3

చివరగా.. క్లైమాక్స్ లో గుడిలో అద్భుతమైన ఫైట్ సీన్ ఉంటుంది. చక్రాన్ని లేపి మరీ బాలకృష్ణ చేసిన ఈ ఫైట్ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ సన్నివేశంలో మీరొకటి గమనించారా..? ఈ షాట్ లో బాలకృష్ణ తో సహా విలన్స్ లో కూడా ఎవరికీ చెప్పులు ఉండవు. గుడి ప్రాంగణం కాబట్టి ఎవరు చెప్పులు లేకుండానే లోపల షూట్ లో పాల్గొన్నారు. ఇవి చిన్న చిన్న విషయాలే.. కానీ, ధర్మానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఈ సినిమాను తీశారు. ఈ చిన్న చిన్న అంశాలే సినిమాకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. అందుకే మనం బోయపాటిని, బాలయ్యని మెచ్చుకోవాలి.


End of Article

You may also like