వారిసు “రంజితమే” పాటలో… హైలైట్ అయిన ఈ అమ్మాయిని గమనించారా..?

వారిసు “రంజితమే” పాటలో… హైలైట్ అయిన ఈ అమ్మాయిని గమనించారా..?

by Anudeep

Ads

కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘వారసుడు’ (వారిసు). వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్‌, ప‌ర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతికి మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం లో విజయ్ సరసన రష్మిక నటించింది. ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ కావడం తో పాటు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు తెలుస్తోంది.

Video Advertisement

 

ఈ చిత్రం లోని “రంజిత‌మే..” సాంగ్ రికార్డు స్థాయిలో వ్యూస్ ని సంపాదించుకుంది. తెలుగులో ఈ పాటను అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కాగా.. తాజాగా సినిమా నుండి రంజితమే సాంగ్ రిలీజై యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ సాంగ్ లో విజయ్, రష్మిక డాన్స్ ఇరగదీసారు. అయితే వీరిద్దరితో పాటు మరో ఒక డాన్సర్ హై లైట్ అవుతోంది.

who this dancer in ranjithame song..

ఈ సాంగ్ చివరిలో హీరో విజయ్ పక్కనే(కుడివైపు రెడ్ కలర్ డ్రెస్) అమ్మాయి చాలా ఎనర్జిటిక్ గా షెహనాయ్ ఊది.. స్టెప్స్ ఇరగదీసింది. దీంతో ఇప్పుడు నెటిజన్స్ దృష్టంతా ఆ అమ్మాయి పైనే పడింది. వెంటనే ఆమె గురించి నెట్టింట శోధన ప్రారంభించారు. ఆమె వివరాల్లోకి వెళ్తే.. ఆమె పేరు అంబికా కోహ్లీ. ఇన్ స్టాగ్రామ్ లో ఐడి ‘పటాకా’ అని పెట్టుకుంది. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో దాదాపు లక్షకు పైగా ఫాలోయర్స్ ని కలిగి ఉంది. అలాగే డాన్స్ తో పాటు ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని షేర్ చేస్తోంది.

who this dancer in ranjithame song..

సినిమాలలో డాన్సర్ గా రాణిస్తూనే.. ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తూ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోందట అంబికా. ప్రస్తుతం రంజితమే సాంగ్ లో విజయ్, రష్మికల పక్కన అంబికా చేసిన స్టెప్స్ హైలైట్ గా మారాయి. హీరోయిన్ రష్మిక ని మించి ఆమె పైకే అందరి ఫోకస్ వెళ్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ బ్యూటీ వైరల్ గా మారింది.


End of Article

You may also like