PUSHPA: “ఊ అంటావా” సాంగ్ లో ఈ రెండు సీన్లు గమనించారా.? సినిమా రిలీజ్ అయినప్పుడు అలా.?

PUSHPA: “ఊ అంటావా” సాంగ్ లో ఈ రెండు సీన్లు గమనించారా.? సినిమా రిలీజ్ అయినప్పుడు అలా.?

by Anudeep

Ads

పుష్ప మూవీ థియేటర్ లో విడుదల అయ్యి హిట్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. ఓటిటిలో విడుదల అయ్యిన తరువాత కూడా పుష్ప హవా కొనసాగుతూనే ఉంది. ఇంకా.. పుష్ప గురించి సోషల్ మీడియాలో కధనాలు వస్తూనే ఉన్నాయి.

Video Advertisement

పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు.

oo antava 1

ఈ సినిమాకు “ఊ అంటావా.. ఉహూ అంటావా మావా..” అనే పాట చాలా హైప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాటలో సమంత నర్తించడంతో మరింత పాపులారిటీ వచ్చింది. ఈ పాట కోసమే ఈ సినిమాను థియేటర్లో చూడాలి అని ఫాన్స్ ఫిక్స్ కూడా అయిపోయారు. అల్లు అర్జున్ తో సహా నటుల లుక్స్ డిఫరెంట్ గా ఉండడం, ప్రత్యేక గీతంలో సమంత నర్తించడంతో ఈ సినిమాపై ఫాన్స్ బాగానే ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.

oo antava 2

ఇది ఇలా ఉంటె..ఈ సినిమా ఇటీవల ఓటిటిలో విడుదల అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఇందులో “ఊ అంటావా.. ఉహూ అంటావా మావా..” పాటకు స్టెప్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. థియేటర్ లో రిలీజ్ అయిన వెర్షన్ లో ఒకలా ఉంటె.. ప్రైమ్ లోను, యూట్యూబ్ లో విడుదల అయిన వీడియో లోను ఒకలా ఉంది. ఓవర్సీస్ కోసం ఒకలా, ఇండియన్ థియేటర్స్ కోసం ఒకలా కట్ చేసినట్లున్నారు. ఈ రెండు వేర్వేరు గా ఉండడంతో ఇలా ఎందుకు చేశారు? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియో ను మీరు ఇక్కడ చూసేయచ్చు.

Watch Video: 


End of Article

You may also like