Ads
మనం సాంగ్స్ కి డాన్సులు చూసేప్పుడే హీరో ఏ స్టెప్పులు వేస్తున్నాడు. హీరోయిన్ ఏ కాస్ట్యూమ్స్ వేసుకుంది అని గమనిస్తాం కానీ సైడ్ డాన్సర్స్ చేసే డాన్స్ ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. మన చూపేప్పుడు హీరో, హీరోయిన్, లేదా చుట్టూ ఉండే లొకేషన్స్ పై మాత్రమే ఉంటుంది.
Video Advertisement
అయితే ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలపతి విజయ్, పూజ హెగ్డే హీరో హీరోయిన్లు విడుదలైన బీస్ట్ లో ఇలాంటి పొరపాటే ఒకటి జరిగింది. బీస్ట్ మూవీలోని “జాలీ ఓ జింఖానా” అనే పాటకు హీరో హీరోయిన్ మరియు సైడ్ డాన్సర్స్ అంతా ఒక స్టెప్ వేస్తుంటే.. ఒక డాన్సర్ మాత్రం స్టెప్స్ మరిచిపోయి ఇంకో స్టెప్ వేస్తూ ఉండిపోయాడు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కొరియోగ్రాఫర్ కూడా ఈ మిస్టేక్ ని చూసి ఉండడు. కొన్నిసార్లు తెలీకుండానే తప్పులు జరిగిపోతుంటాయి అని కామెంట్ చేస్తున్నారు. ఆ స్టెప్ ఏంటో కింది వీడియోలో చూడండి.. జాలీ ఓ జింఖానా.. ఈ పాటకు తెలుగులో లిరిక్స్ చంద్రబోస్ రాయగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రం తమిళ్ నుంచి హిందీ, తెలుగు, కన్నడ మరియు మళయాళంలో కూడా డబ్ చేయబడింది. తెలుగులో కూడా విజయ్ క్రేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది.
విజయ్ సినిమాలు డబ్బింగ్ సినిమాలు అయినా కూడా, తెలుగులో విడుదల అయితే తెలుగు హీరోల సినిమాలు విడుదల అయినప్పుడు ఎలా అయితే సందడి ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా విజయ్ 66వ సినిమా. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేసారు. ఇందులో విజయ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా పేరు తమిళ్ లో వారిసు అని పెట్టారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ విడుదల చేశారు. అలాగే త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా చేయనున్న సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం.
watch video :
https://youtu.be/YS1Wp4zBI6w
End of Article