Ads
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని మరియు నజ్రియా నజీమ్ హీరో, హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అంటే సుందరానికి. ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది.
Video Advertisement
ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నరేష్, రోహిణి, శ్రీకాంత్ అయ్యంగార్, పృథ్వి రాజ్, హర్షవర్ధన్ మరియు తదితరులు నటించారు. నవీన్, వై రవి శంకర్, సి. వి మోహన్ నిర్మాణ బాధ్యతలను చేపట్టగా, వివేక్ సాగర్ సంగీత దర్శకత్వం వహించారు.
కొత్తగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆధారంగా.. అంటే సుందరానికి ఈ చిత్రంలో నాని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుర్రాడిగా కనిపిస్తారు. అదే విధంగా హీరోయిన్ నజ్రియా నజీమ్ క్రిస్టియన్ కి కుటుంబానికి చెందిన యువతిగా కనిపిస్తుంది. వీరిరువురి మధ్య ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే ఈ కథ నడుస్తుంది. ఈ కథలో సుందరానికి అదేనండి నానికి వేరే దేశాలు వెళ్లాలని కోరికగా ఉంటుంది. హీరోయిన్ పరిచయంతో ఆ కోరికకు మరింత బలం చేకూరుతుంది.
టైలర్ లోని వీరిరువురి మధ్య జరిగిన ఓ సంభాషణలో “నేను కాలిఫోర్నియాలో ఉన్నాను ఇక్కడ వర్షాలు రా బాబు ఓ మై గాడ్ అంటూ ఒక డైలాగు చెబుతాడు “. అంటే తన స్నేహితుడు ఫోన్ చేస్తే నేను వేరే దేశంలో ఉన్నాను అంటూ గొప్పగా చెప్పుకోవాలి అనుకుంటాడు. ఈ డైలాగు వింటే మీకు కూడా ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదూ.. మరి ఎక్కడ విన్నాను అని ఆలోచిస్తున్నారా..
అదేనండి అనుదీప్ K.V దర్శకత్వం లో నవీన్ పోలిశెట్టి మరియు ఫారియా అబ్దుల్లా కలిసి నటించిన జాతి రత్నాలు సినిమాలో చూసినట్లు ఉంది కదూ.. హీరో హీరోయిన్ తో కలిసి ఒక సన్నివేశంలో తాజ్ బంజారాకి వెళ్ళినప్పుడు ఈ టైం లో ఎవరైనా స్నేహితుడు ఫోన్ చేస్తే ఎంత బాగుంటుంది అంటూ ఉండగా కాల్ వస్తుంది. అరేయ్ నేను తాజ్ బంజారా లో ఉన్నాను అంటూ గొప్పగా చెప్పుకుంటాడు.
End of Article