బాలకృష్ణ “లెజెండ్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

బాలకృష్ణ “లెజెండ్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

by Anudeep

Ads

యాక్షన్ మూవీ దర్శకత్వానికి మారుపేరు బోయపాటి శ్రీను. ఈయన దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ మూవీస్  మంచి  సక్సెస్ రేటుని అందుకుంటాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2014లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా  బాలయ్య బాబు నటించి ప్రేక్షకుల ముందు వచ్చిన సినిమా లెజెండ్.

Video Advertisement

ఈ చిత్రంలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేశారు. బాలయ్య బాబు సరసన రాధిక ఆప్టే మరియు సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించగా జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.

వారాహి చలన చిత్ర నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా మార్చి 28, 2014 లో విడుదల అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రం తెలుగులో ఫోర్త్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా రికార్డును సాధించింది. బాలయ్య బాబు డైలాగ్స్ కానీ, యాక్షన్ గాని అదుర్స్ అని చెప్పవచ్చు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. అప్పటిలో ఈ చిత్రానికి క్రిటిక్స్ సైతం మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అప్పట్లోనే ఈ సినిమా 38 కోట్ల మార్కును దాటింది.

did you observe this scene in balakrishna legend movie

ఇప్పుడు అసలు విషయానికి వస్తే సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయం వైరల్ గా మారుతుంది. అప్పుడు బోయపాటి ఒక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో చేసిన చిన్న తప్పు, మీమ్స్ రుపంలో బయటకు వచ్చింది. ఆ తప్పే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. బోయపాటి చేసిన ఆ సన్నివేశంలో స్క్రీన్ పై సుమోలతోపాటు కొండలు కూడా తారుమారు అవుతాయి. ఇదేంటి సుమోలతోపాటు కొండలు జంప్ చేస్తున్నాయ్ అంటూ నెటిజన్లు టోల్ చేస్తున్నా ఈ మీమ్స్ ఇప్పుడు ట్రేడింగ్ గా మారి హాస్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ట్రేడింగ్ గా మారినా ఆ మీమ్స్ ఏంటో మీరు కూడా ఒకసారి చూసేయండి.


End of Article

You may also like