“NTR 31” పోస్టర్ లో ఇది గమనించారా..? అంటే ఎన్టీఆర్ వాళ్లద్దరికీ పుట్టబోయే కొడుకు అవుతాడా..?

“NTR 31” పోస్టర్ లో ఇది గమనించారా..? అంటే ఎన్టీఆర్ వాళ్లద్దరికీ పుట్టబోయే కొడుకు అవుతాడా..?

by Anudeep

Ads

ఈ మధ్య సినిమా హీరోల బర్త్ డే లకు వాళ్ళ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు ఇస్తున్నారు. మే 20 న తారక్ బర్త్ డే సందర్బంగా తన 31 వ సినిమా కు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా కు డైరెక్షన్ చేస్తున్నాడు.

Video Advertisement

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ ఫేస్ మాత్రమే కనిపిస్తోంది. అయితే ఆ ఫేస్ కూడా నల్లగా.. బొగ్గు గనుల్లో తిరిగినట్లు కనిపిస్తూ ఉంది.

ntr 31 2

దీనితో ఈ సినిమాలో కూడా ప్రశాంత్ నీల్ బొగ్గు ఫాంటసిని వదల్లేదుగా అంటూ సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ పోస్టర్ విడుదల అయ్యిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్ట్ లు బాగానే వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటె ఇప్పుడు ఈ పోస్టర్ గురించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ntr 31 1

ఎన్టీఆర్ 31 పోస్టర్ ను జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే, ఎన్టీఆర్ 31 (NTR 31) అన్న టైటిల్ రెండు కలర్లలో కనిపిస్తుంది. N అనే అక్షరం ఎరుపు రంగులో కనిపిస్తూ ఉండగా.. TR అనే రెండు అక్షరాలు మాత్రం గ్రే కలర్ లో కనిపిస్తుంది. N అనే అక్షరం కెజిఎఫ్ సినిమా ఫాంట్ లో ఉంటె.. TR అనే రెండు అక్షరాలు సలార్ సినిమా ఫాంట్ లో కనిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ టైటిల్ లెక్క ప్రకారం.. కెజిఎఫ్ లో రమిక కి, సలార్ లో జగ్గు భాయ్ కి పుట్టబోయే కుమారుడే ఎన్టీఆర్ అయ్యుంటాడు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.


End of Article

You may also like