ఈ ఫోటోలో ఉన్న… “తెలుగు స్టార్ హీరో” ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో ఉన్న… “తెలుగు స్టార్ హీరో” ఎవరో గుర్తుపట్టారా..?

by Anudeep

Ads

నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్‌గా ‘బింబిసార’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఫిక్షన్ కథతో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఆయన బావమరిది కె. హరికృష్ణ నిర్మాతగా తెరకెక్కిన ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

Video Advertisement

మూడోతరం నందమూరి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ తరవాత క్లిక్ అయ్యింది కళ్యాణ్ రామ్ ఒక్కరే. తమ్ముడు అంత కాకపోయినా తనకంటూ సెపరేట్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో ఈయన. కథానాయకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై సినిమాలు చేస్తున్నారు. 2015లో వచ్చిన ‘పటాస్’ సినిమా తరవాత మళ్లీ ఆ స్థాయి హిట్‌ను ‘బింబిసార’తో అందుకున్నారు కళ్యాణ్ రామ్. తమ హీరో ఈ ఫామ్‌ను కొనసాగించాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. వారి అభిలాషకు తగ్గట్టుగానే కళ్యాణ్ రామ్ 19వ సినిమా కనిపిస్తోంది.

guess this tollywood star hero..!!
ఇక బింబి సార సినిమా ఇచ్చిన బూస్ట్‌తో కళ్యాణ్ రామ్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 19వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది.

guess this tollywood star hero..!!
కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఇటీవల గోవాలో షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా, త్వరలోనే తన నెక్ట్స్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు గిబ్రన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది.

guess this tollywood star hero..!!
కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ రెండు చేతుల్లో గన్స్ పట్టుకొని స్టైలిష్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే ఇది యాక్షన్ సీన్‌కు సంబంధించిన విజువల్ అని అర్థమవుతోంది. విపరీతమైన దుమ్ములో బోల్తా పడిన వాహనం దగ్గర నుంచి గన్స్ పట్టుకుని కళ్యాణ్ రామ్ వస్తున్నారు. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ మళ్లీ వెండితెరపై మాస్ జాతర గ్యారంటీ అని అంటున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది. కాగా, ఈ సినిమా టైటిల్‌ను ఇంకా చిత్ర యూనిట్ ఫైనల్ చేయకపోవడంతో, ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను పెడతారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

guess this tollywood star hero..!!
క‌ల్యాణ్ రామ్ దీంతోపాటు అభిషేక్ పిక్చర్స్ బ్యాన‌ర్‌లో నవీన్ మేడారం డైరెక్ష‌న్‌లో ‘డెవిల్’ అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం వ‌స్తుండ‌గా…ఇప్ప‌టికే విడుద‌లైన‌ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది.


End of Article

You may also like