“సుందరకాండ” హీరోయిన్ “అపర్ణ” గుర్తున్నారా.? ఇప్పుడెలా ఉన్నారో…ఏం చేస్తున్నారో తెలుసా.?

“సుందరకాండ” హీరోయిన్ “అపర్ణ” గుర్తున్నారా.? ఇప్పుడెలా ఉన్నారో…ఏం చేస్తున్నారో తెలుసా.?

by Mohana Priya

Ads

వెంకటేష్ నటించిన సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలలో 1992లో వచ్చిన సుందరకాండ ఒకటి. ఈ సినిమాకి కె.రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. తమిళ్ లో సుందరకాండం పేరుతో వచ్చిన సినిమాకి తెలుగు రీమేక్ ఇది. సుందరకాండ సినిమాకి ఎం.ఎం. కీరవాణి స్వరాలను అందించారు. ఒక స్టూడెంట్ టీచర్ ని ఇష్టపడితే ఎలా ఉంటుంది అని సాగే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మీనా నటించగా, వెంకటేష్ ను ఇష్టపడే స్టూడెంట్ పాత్రలో అపర్ణ నటించారు.

Video Advertisement

ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు అపర్ణ. సుందరకాండ సినిమాలో నటించినప్పుడు అపర్ణ ఎనిమిదో తరగతి చదువుతున్నారు. సుందరకాండ నిర్మాత అయిన ఎం.వి.వి సత్యనారాయణ గారు అపర్ణకి బంధువులు అవుతారు. సత్యనారాయణ గారు ఈ సినిమా కోసం అపర్ణ వాళ్ళ తల్లిదండ్రులను అడగడంతో వాళ్ళు సరే అన్నారు.

సుందరకాండ సినిమా తర్వాత అపర్ణ కి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయట. అపర్ణకి నటన అంటే ఇష్టం ఉన్నా కూడా చదువుపై శ్రద్ధ పెట్టాలని అనుకున్నారు. అందుకే వచ్చిన అవకాశాలలో చాలా వాటిని రిజెక్ట్ చేశారు అపర్ణ. తర్వాత మాస్టర్స్ చదువుతున్నప్పుడే 2002 లో అపర్ణకి పెళ్లి అయిపోయి అమెరికా వెళ్లిపోయారు. వాళ్ళ కుటుంబంలో అపర్ణ మొదటి ఆర్ట్స్ గ్రాడ్యుయేట్.

సుందరాకాండ సినిమాలో తన నటనకు ఎన్నో అవార్డులను అందుకున్నారు అపర్ణ. ఈ సినిమా తర్వాత అపర్ణ తెలుగులో దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో వచ్చిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం సినిమాలో, కన్నడలో విష్ణువర్ధన్ గారితో పర్వ, ఆ తర్వాత అమ్మా నాగమ్మ అనే సినిమాలో నటించారు. తర్వాత శాంతినికేతన్, చంద్ర జ్వాల సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం అపర్ణ కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. అపర్ణకి ఒక బాబు కూడా ఉన్నాడు.

watch video:


End of Article

You may also like