Ads
2000 సంవత్సరం టైంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు సాక్షి శివానంద్. సాక్షి శివానంద్ ముంబై కి చెందిన వారు. 1995 లో వచ్చిన జనమ్ కుండలి అనే హిందీ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టారు. తర్వాత రెండు హిందీ సినిమాల్లో నటించారు. 1996 లో ఇంద్రప్రస్థం అనే మలయాళం సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించారు. అదే సంవత్సరం మంజీర ధ్వని అనే మరొక మలయాళం సినిమాల్లో కూడా నటించారు.
Video Advertisement
1997 లో పుదయల్ అనే తమిళ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు సాక్షి శివానంద్. 1997 లోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కలెక్టర్ గారు, రాజహంస, నిధి, స్నేహితులు, సముద్రం, సీతారామరాజు, ఇద్దరు మిత్రులు ఇలా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు.
సీతారామరాజు, సింహ రాశి, సముద్రం, ఇద్దరు మిత్రులు, యువరాజు వంటి సినిమాలు సాక్షి శివానంద్ ని తెలుగు వారికి ఇంకా దగ్గర చేశాయి. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా ఖుషి హిందీలో అదే పేరుతో రీమేక్ అయింది. హిందీ రీమేక్ లో ఫర్దీన్ ఖాన్, కరీనా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో కూడా సాక్షి శివానంద్ ఒక స్పెషల్ రోల్ లో నటించారు.
సాక్షి శివానంద్ తెలుగులో చివరిగా 2010 లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన రంగ ది దొంగ సినిమాలో కనిపించారు. తర్వాత ఆది భగవాన్ అనే తమిళ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ చేశారు. కన్నడలో పరమశివ అనే సినిమాలో నటించారు.
హిందీలో దిల్లగీ యే దిల్లగీ అనే సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా విడుదల అవ్వలేదు. సాక్షి శివానంద్ కి సాగర్ తో వివాహం జరిగింది. సాక్షి శివానంద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు. అందుకే తన వ్యక్తిగత విషయాల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా బయటికి రాదు.
సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా ఆనంద్ కూడా సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు. విష్ణు హీరోగా వచ్చిన మొదటి సినిమా విష్ణు లో హీరోయిన్ గా శిల్పా ఆనంద్ నటించారు.
End of Article